Natyam ad

ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం

ఒంటిమిట్ట ముచ్చట్లు:

శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి
శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు .ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం
శ్రీ సీతాలక్ష్మణ సమేతశ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.సాయంత్రం 6.30 గంటలకు శ్రీసీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 7 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నాగరత్న, ఏఈవో  పార్థసారథి, సూపరింటెండెంట్‌  సోమ శేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Ottimitta Ramulori Kalyanam

Post Midle