నాగబాబు కామెంట్స్ పై  మా కమిటీ మండిపాటు

హైదరాబాద్  ముచ్చట్లు :

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) రగడ మొదలైంది. ప్రెస్ మీట్లతో వ్యవహారం వేడెక్కిపోతోంది. మొన్నప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ని పరిచయం చేశారు. ఆ సమావేశంలో నాగబాబు, బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీకే నరేష్ ఇప్పుడు వాటికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తానేమీ కథలు చెప్పేవాడిని కాదని, ఉన్న వాస్తవాలను చెప్పడానికి కాగితాలతో వచ్చేవాడిని అని నరేష్ చెప్పుకొచ్చారు. ఇక ప్రకాష్ రాజ్ మీడియా మీద సెటైర్లు వేస్తే.. నరేష్ మాత్రం మీడియాను గౌరవించారు. సీనియర్ జర్నలిస్ట్, పీఆర్వో బీఏరాజు, నటుడు, జర్నలిస్ట్ అయిన టీఎన్ఆర్‌కు నివాళి అర్పించి అందరి మనసు గెలిచారు.ఈ ప్రెస్ మీట్‌లో నరేష్ మాట్లాడుతూ.. ‘ప్రకాశ్ రాజ్ నాకు మంచి మిత్రుడు.. నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేశారు. అయితే ఇంకా టైం ఉంది ఎలక్షన్ అని ప్రకటించిన తరువాత ఎవరైనా పోటీ చేయోచ్చని అన్నాను. అయితే ఆ సమయంలోనే కరోనా, ఇన్సూరెన్స్ అంటూ ఎన్నో పనులున్నాయని అన్నాను. పోటీ ఎవరు చేసినా, అధ్యక్షుడిగా ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పాను.మంచు విష్ణు.. మన ఇంటి బిడ్డ.. కష్టనష్టాలు, లాభనష్టాలు చూడకుండా వందల వేల మందికి అన్నం పెట్టినవారు. అలాంటి బిడ్డ పోటీ చేస్తానన్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైనా నాడు ఓ మాట చెప్పాను. ఈ పదవికి ఒక్కసారే పోటీ చేస్తా.. రెండో సారి చేయను అని నాడే చెప్పాను. అయినా నాది రెండేళ్ల ప్రయాణంలా చూడకండి..నేను ‘మా’లో ఆరేళ్లుగా ఉన్నాను. అయినా ఇది రాజకీయ వ్యవస్థ కాదు.
చిరంజీవి, మొరళీమోహన్, మోహన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ వంటివారంతా కలిసి పెట్టారు. ఎక్కడో మద్రాస్‌లో ఉన్న పరిశ్రమను ఇక్కడకు తెచ్చారు.. మన అందరికీ ఓ గొడుగులా ఉండాలని వారంతా కలిసి ఈ సంస్థను పెట్టారు. అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా కూడా సంతోషమే. ఇప్పుడు ఇన్సూరెన్స్ పనులు జరుగుతన్నాయి.. మా డబ్బులు మేం వేసుకుని ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం. ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అలా ఎవ్వరైనా సరే పెట్టుకోవచ్చు. అది వారి హక్కు.ఆయన్ని మేం ఏం తప్పు అనడం లేదు. మా కమిటీ ఫోర్స్‌లో ఉన్నవారు కూడా అక్కడ కనిపించారు. అది మాకు కొంచెం బాధగా అనిపించింది. నాగబాబు గారు నాకు మంచి మిత్రుల. ఆయన ఓ మాట అన్నారు. ‘మా’ నాలుగేళ్లుగా మసకబారింది అని అన్నారు. అలా అనడడం తప్పు.. మాతో నాలుగేళ్లుగా ఉన్నారు.. బైలాస్ ప్రకారం అలా అనకూడదు. అలా అనడం అనమాకు షాక్ అనిపించింది.. రెండేళ్లలో కొంత అసమ్మతి ఉన్నా కూడా పెద్దలందరూ కలిసి అన్ని సమసిపోయేలా చేశారు. మా మసకబారిందా.. ముందుకు వెళ్తోందా? అని మేం అంతా కూడా కలిసి చర్చించుకున్నాం. అలా మాట్లాడటం, సంస్థను కించపరచడడం మంచిది కాదు. లోకలా?నాన్ లోకలా? అని మేం అనం.. ఓటు వేశారా? ఎన్నికలకు వచ్చారా? జనరల్ బాడీ మీటింగ్‌కు వచ్చారా? అని మేం అనం. ఇప్పటి వరకు 728 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాం. చనిపోయే సినీ ఆర్టిస్ట్‌ల కుటుంబాలకు వెంటనే మూడు లక్షల రూపాయల చెక్కులు ఇప్పించామని నరేష్ తెలిపారు. ప్రకాష్ రాజ్‌కు కనీసం మా మెంబర్స్ ఎంత మంది ఉంటారు? ఎంత మంది సభ్యులు ఉంటారో కూడా తెలియదన్నట్టుగా అన్నీ లెక్కలు చెప్పి చురకలు అంటించారు.
పరోక్షంగా వార్నింగ్ : కరాటే కళ్యాణి
టాలీవుడ్‌‌లో మళ్లీ రగడ మొదలైంది. మా ఎన్నికల సెగలు అప్పుడే మొదలయ్యాయి. ఇంకా ఎన్నికలకు మూడు నాలుగు నెలల సమయం ఉన్నా కూడా వేడి మాత్రం ఇప్పుడే ప్రారంభం అయింది. ఈ సారి పోటీ మరింత రసవత్తరంగా సాగేలా ఉంది. విమర్శలు, ఆరోపణలతో ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నాగబాబు మాట్లాడిన మసకబారిన డైలాగ్, నాగబాబు చేసిన కామెంట్లు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా మా అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్ పెట్టి అన్నింటిపైనా క్లారిటీ ఇచ్చారు. అదే క్రమంలోకరాటే కళ్యాణి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.‘ఇన్ని రోజులు అబద్దాలు వింటూ వచ్చాం.. బయట అందరూ కరోనాతో బాధపడుతు ఉంటే.. మేం మాత్రం మరింత బాధను భరిస్తూ వచ్చాం. మేం పని చేస్తూ ఉన్నా కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎక్కువ బాధ కలిగింది. ‘మా’ అంటే అమ్మ.. మా అమ్మ నాకు జన్మ ఇస్తే.. సినీ పరిశ్రమ పునర్జన్మ ఇచ్చింది. మా పరిశ్రమను ఎవరైనా తిడితే నేను మాత్రం ఊరుకోను. నేను తిరిగి తిడతాను.. అందరిచేత తిట్లు తింటాను. నేను ఏం మాట్లాడినా అందులో నిజం ఉంటుంది.అమ్మను మీరు కించపర్చుకోకండి.. అమ్మను ఎంత ప్రేమిస్తారో.. సినిమా పరిశ్రమను అంతే ప్రేమించండి.. కానీ మీరు ఇప్పటికీ మా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాట్సప్ గ్రూపుల్లో కామెంట్లు పెడుతున్నారు. కుర్చీ మీద అంత ప్రేమ ఏంటి? కావాలంటే తీసుకోండి..అంత అధికార దాహం ఏంటి? అయినా అది ఓ సేవలాంటిదని కరాటే కళ్యాణి అన్నారు.కమిటీ ఫోర్స్‌లో ఉంటే. అక్కడ ఎలా మాట్లాడతారు. అక్కడ వారు మాట్లాడుతుంటే ఎలా మద్దతిస్తారు. మీరు సినిమాను అమ్మగా భావిస్తే అలా చేయరు. స్టేజ్ మీద పక్కనే ఉండి చప్పట్లు కొడితే శిక్షార్హులు. వారు అలా మాట్లాడుతుంటే.. మసకబారిందని అనాల్సిన అవసరం లేదు.. మీరు అలా సైలెంట్‌గా స్టేజ్ దిగా రావొచ్చు. లోకల్ నాన్ లోకల్ అని వదిలేద్దాం.. మేం తమిళనాడులో పోటీ చేయోచ్చా? ఓట్లు వేయకపోయినా, ఎన్నికల్లో పాల్గొనకపోయినా కూడా పోటీ చేయొచ్చు.. ‘మా’ కార్డు ఇచ్చింది కదా? ఏదైనా చేయోచ్చు.పని చేయలేదు అని ప్రతీసారి అంటే కోపం వస్తుంది.. మేం కూడా అన్నీ మాట్లాడగలం..మేం ఏమైనా పని చేయకుండా గెలుస్తున్నామా?.. ఇవన్నీ నరేష్ గారు చూపించారు.. తప్పులు ఏమైనా ఉంటే చూపించండి.. లేదా ఎవరైనా మంచి వ్యక్తిని చూపించండి.. డిసిప్లినరీ కమిటీ దగ్గరకు వెళ్దాం.. మేం అంతా ఓటు వేస్తాం.. కరోనాలో కూడా ఈ గొడవలు ఏంటి.. అందరూ అంటున్నారు. అది కాదు కావాల్సింది..ఎవరికైనా సాయం చేయాలంటే చేయండి.. ఓ పది వేలు ఇస్తే.. మంచి వాళ్లని వాళ్లే చెబుతారు.. మనం చెప్పనక్కర్లేదు.మా కమిటీ ఇంకా ఫోర్స్‌లో ఉంది.. రెండు మూడు నెలలు టైం ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్లి వారు మాట్లాడుతుంటే మద్దతు పలికారు. ఇది కచ్చితంగా నేరమే. శిక్ష పడాల్సిందే. పదవులున్నాయంటే ఏది పడితే అది చేస్తే కుదరదు. ఎన్ని అన్నా కూడా రాత్రి పగలు కష్టపడి చేశాం.. కరోనా సమయంలో ఇంత కష్టపడితే మసకబారిందని ఎలా అంటారు.. మహిళకు అవకాశం ఇస్తే మేం అంతా కూడా సహకరిస్తాం.. డిసిప్లినరీ కమిటీ ఎవరిని నిర్ణయిస్తే వారికి మద్దతుగా నిలుస్తాం.. మా అమ్మ నాకు అన్నం పెట్టింది.. నాకు విలువను ఇచ్చింది సినీ పరిశ్రమ. ఆడవాళ్లు అంటే గౌరవం లేని వ్యక్తులకు మేం మద్దతు ఇవ్వం. ప్రత్యక్షంగా నేనే ఉదాహరణని. ఆడవాళ్లను గౌరవించని వారిని ఒప్పుకునేది లేద’ని ప్రకాశ్ రాజ్ మీద పరోక్షంగా కరాటే కళ్యాణి కౌంటర్లు వేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Our committee is angry over Nagababu’s comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *