చదలవాడ బ్రదర్స్ సమర్పణలో విడుదలకు సిద్ధమైన మా నాన్న నక్సలైట్

హైదరాబాద్ ముచ్చట్లు:


చదలవాడ బ్రదర్స్ సమర్పణలో  అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకం పై పీ. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడిగా చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన   “మా నాన్న నక్సలైట్” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది.  తొంభై వ దశకంలో ని సామాజిక పరిస్థితుల నేపథ్యం లో సాగే ఈ  కథ. లో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన  రఘు కుంచే కొండరుద్ర సీతారామయ్య పాత్రను పోషించారు. నటుడు అజయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  అలాగే సుబ్బరాజు   రాజకీయ నాయకుడు పాత్రలో నటించగా . జర్నలిస్ట్ సూర్య ప్రకాష్ రావు పాత్రలో ఎల్ బి శ్రీరామ్ నటించారు. యువ జంటగా  కృష్ణ బూరుగుల , రేఖ నిరోషా నటించిన ఈ చిత్రానికి సంగీతం అందించింది ప్రవీణ్ ఇమ్మడి.
చిత్ర విశేషాలు తెలియజేస్తూ , మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా అలరించే అన్ని హంగులతో చిత్రం రూపుదిద్దుకుందని, నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల పనితనంతో చిత్రం హృద్యంగా తెరకెక్కిందని, తండ్రి కొడుకుల  సెంటిమెంట్ ప్రతి ఒక్క ప్రేక్షకుని  మనసు తాకుతుందని, త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న   నమ్మకం తనకుందని చిత్ర నిర్మాత శ్రీనివాస రావు తెలియచేసారు.
దర్శకుడు  సునీల్ కుమార్ రెడ్డి, ఇది  నక్సల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే తండ్రి కొడుకుల కథ అని ,  రఘు కుంచే ఒక నక్సల్ నాయకుడిగా  కొడుకు కోసం పరితపించే ఒక తండ్రి గా  చాలా సహజంగా  నటించారని . సినిమా చాలా బాగా వచ్చిందని , ఈ చిత్రంలో  తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చుపించామని , ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్  నేతృత్వం లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగా కుదిరాయని అయన కూడా  ఒక  కీలక పాత్రలో నటించారని , తెలిపారు.
బ్యానర్ : అనురాధ ఫిలిమ్స్ డివిజన్
చిత్రం పేరు : మా నాన్న నక్సలైట్
నటి నటులు : రఘు కుంచే, అజయ్, సుబ్బ రాజు , ఎల్ బి శ్రీరామ్, జీవ, కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా, వినయ్ మహాదేవ్, అనిల్, ఎఫ్ ఎమ్ బాబాయ్, సముద్రం వెంకటేష్, బుగత సత్యనారాయణ , అంకోజీ రావు , కాశి విశ్వనాథ్, కనకా రావు, ప్రసన్న కుమార్, పద్మజ లంక, డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, తదితరులు

 

Tags: Our father Naxalite ready for release at the Chadalwada Brothers presentation

Leave A Reply

Your email address will not be published.