వల్లూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
అచంట ముచ్చట్లు:
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతూ ప్రతీ పేదవాడికి అండగా నిలుస్తున్న సీఎం జగన్, వారి గుండెల్లో నిలిచిపోయారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకు వాడ శ్రీ రంగనాథరాజు అన్నారు.పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులో గడపగడపకూ మన ప్రభుత్వంలో పాల్గొని సంక్షేమ పథకాల లబ్దిదారులను లబ్దిదారులకు వివరించారు. గ్రామంలోని సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ముందుకు సాగారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను విప్లవంలా అమలు చేస్తుండడంతో పేదల ఇళ్లల్లో వెలుగులు నిండాయన్నారు. కరోనా సమయంలోనూ ఇబ్బందులు పడకుండా సంక్షేమాన్ని అందించడంతో ఎందరో పేదలు ఇబ్బందుల నుంచి గట్టెక్కారన్నారు.దానితో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు. దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. అయినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా సీఎం జగన్కు ఎదురునిలిచే వారు లేరన్నారు. సీఎం జగన్ మరోసారి విజయం సాధించడం ఖాయ మన్నారు.మరింత సం క్షేమం అందించడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే సీఎం ఆదేశాల మేరకు గడపగడపకు మన ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ ఛాంబర్ అధ్య క్షుడు సుంకర సీతారాం, వల్లూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చిల్లే లావణ్య, సర్పం చ్లు జక్కంశెట్టి చంటి,భీమలాపురం ఇన్చార్జి మొల్లేటి శ్రీరామకష్ణ. చింతపల్లి. గురుప్రసాద్, మైలే ఏసురత్నం, నారిన బాబులు, పెచ్చెట్టి సత్యనారాయణ,వరప్రసాద్, కంబాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags: Our government program for Gadapagadap in Valluru

