పెనుగుదురు లో గడప గడపకు మన ప్రభుత్వం

కాకినాడ ముచ్చట్లు:


కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో రెండో రోజు గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్యాలెండర్ అందించి.,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలు హారతి పెట్టి స్వాగతం పలికారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని మహిళలు ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆపూలమాలలు  వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఎస్సి పేటలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు .ఈ సందర్భంగా కురసాల కన్నబాబు  మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాగే గ్రామంలోని పలు సమస్యలు గుర్తించడం జరిగిందని ., వాటిని  పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు యాళ్ళ సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీ లక్ష్మీ సత్తిబాబు, గ్రామ సర్పంచ్ రెడ్డిపల్లి వెంకట మాధవ్ రమేష్, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

 

Tags: Our government should not spend time in Penuguduru

Leave A Reply

Your email address will not be published.