Natyam ad

ఇనుగుంటలో గడప గడపకు మన ప్రభుత్వం

నెల్లూరు ముచ్చట్లు:

ఉమ్మడి నెల్లూరు జిల్లా  ఓజిలి మండలంలోని ఇనుగుంట సచివాలయం పరిధిలోని ఇనుగుంట, లింగారెడ్డి పల్లి, రావిపాడు గ్రామాల్లో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు ప్రజలు,  వైఎస్ఆర్సిపి నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు వివరించి బుక్లెట్లను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతుందని అన్నారు. ప్రజా రంజకంగా పాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలిచి 2024 ఎన్నికల్లో మరో మారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.

 

Tags: Our government should not spend time in the pit

Post Midle
Post Midle