పెనుమంచిలిలో గడప గడపకు మన ప్రభుత్వం
ఆచంట ముచ్చట్లు:
ప్రతీ ఇంట్లో ప్రతీ అవసరాన్ని వైకాపా ఎజెండాగా మార్చుకుని పరిపాలన చేస్తున్నామని ఆచంట శాసనసభ్యులు, మాజీమంత్రి, జిల్లా వైకాపా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం 16 వ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆచంట మండలం పెనుమంచిలి గ్రామంలో రెండవరోజు ప్రతీ ఇంటికి తిరిగి వారి అవసరాలు, సమస్యలు గురుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భముగా ప్రతీ పేటలోను రహదారులు ఇబ్బందిగా ఉన్నాయని, సుమారు 5 దశబ్దాలనుండి ఇబ్బందులు పడుతున్నామని శ్రీ రంగనాధరాజు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భముగా పంచాయితీ రోడ్లు తప్పనిసరిగా వేయాలని అధికారులను ఆదేశించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మూడేళ్ళ పాలనలో ప్రతీ ఇంటికి ప్రతీ మనిషికి మేలు చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ నేతృత్వంలో పనిచేస్తున్నామని అన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో వివిధ పథకాలు కింద రు. 1లక్ష 36 వేల 694 కోట్లు లబ్ధిదారులకు నేరుగా అందాయని తెలిపారు. మూడేళ్ల పరిపాలన లో ఎన్నో చారిత్రాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు. 2019లో చేసిన వాగ్ధానాల్లో 95 శాతం వాగ్ధానాలు అమలుచేసి, ప్రతీ ఏడాది మేనిఫెస్టోను మీ ఇంటికే నేరుగా అందిస్తున్నామన్నారు. ప్రతీ ఇంటికి, ప్రతీ పేదకు మేలు చేసే విధంగా వైకాపా ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి ఫలాలు వివరాలు అన్నింటితో 16 పేజీల బుక్ లెట్ ను కూడా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమంచిలి గ్రామ సర్పంచ్ గణేశుల శేషవేణి, ఆచంట మండల సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షుడు సుంకర సీతారాం, చిల్లే లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
Tags: Our government to Gadapa Gadapa in Penumanchili