విజయపురంలో గడపగడపకు మన ప్రభుత్వం-మంత్రి   ఆర్కే రోజా  

విజయపురం  ముచ్చట్లు:

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు  ఆర్.కె.రోజా  విజయపురం మండలం ఆలపాకం సచివాలయం పరిధిలలో ముత్తపరెడ్డి కండ్రిక, ఒరూరు కమ్మ కండ్రిక గ్రామాలలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు.జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ జనం మెచ్చుకోలుతో పాటు ప్రతి గడపలో మంగళ హారతులు పడుతూ పూలమాలతో మంత్రి గారికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. దుష్ట చతుష్టయం ఎన్ని ఆరోపణలు చేసిన 2024లో జగనన్నకు అండగా ఉంటామని ప్రజలు భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి  జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, బోర్డు మెంబర్లు, చైర్మన్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బందిలు వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags: Our Govt-Minister RK Roja is in Vijayapuram

Leave A Reply

Your email address will not be published.