కుదప గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం

మైలవరం ముచ్చట్లు:


రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలో జోరున వర్షం లోనూ అక్క చెల్లెమ్మలు హారతిలిస్తూ.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతిఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల లబ్దిని వివరిస్తున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అర్హత ఉండి ఇల్లు కట్టుకుంటామని అడిగిన వారందరికీ పక్కాగృహాలు కూడా మంజూరు చేస్తున్నాం. ఇంతవరకు అర్హత ఉండి మాకు సంక్షేమ పథకాలు రాలేదని చెప్పిన వారికి తక్షణమే పరిష్కరిస్తూ..ముందుకు సాగుతున్నారు. ఏ రకమైన వివక్షకు, పక్షపాతానికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నాం. జగనన్న నాయకత్వంలో గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి అని ఎమ్మెల్యే అన్నారు, కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ఎంపీపీలు జెడ్పీటీసీలు , అధికారులు పాల్గొన్నారు.

 

Tags: Our Govt

Leave A Reply

Your email address will not be published.