Natyam ad

రాయపోల్ లో మన ఊరు..మన బడి

రంగారెడ్డి ముచ్చట్లు:


రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయాపొల్ గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమం ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జెడ్పీటీసీ మహిపాల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠాశాలల ను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ0 ప్రతిష్టాత్మక మన ఊరు మన బడి కార్యక్రమం చెప్పిందని తెలిపారు. ప్రైవేట్ పాశాలలకు దీటుగా ప్రభుత్వా పాఠశాల ల అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగ పడుతుంది. జిల్లా లోని అన్ని పాఠశాల కూ ఒకే రంగు వేయనున్నారు. ఇబ్రహీం పట్నంలో ఉన్న  ప్రభుత్వ పాఠశల అభివృద్ధి కి 9కోట్ల 30లక్షల నిధులు కేటాయించారు. పాఠశాల లో ప్రహరీ గోడలు నిర్మాణం, వంట గదులు, డైనింగ్ హాల్, తాగునీటి సౌకర్యం , మరుగు దొడ్లు, పర్నిచర్, చాక్ బోర్డు, డిజిటల్ పరికరాలు సదుపాయాలు ఈ పథకం ద్వారా పనులు చేపట్టనున్నారని అన్నారు. ఈ ఏడాది విద్య నుండి  ఆదిక విద్యార్థులు ఉన్న  33శాతం పాఠశాలలను తీసుకొని అభివృద్ధి చేయనున్నారు. ఇబ్రహంపట్నం లో 15 ప్రభుత్వా పాఠశాల ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.

 

Tags: Our hometown in Raipol..our school