జగనన్న కాలనీలతో మా ఆశలు నేరవేరింది
పుంగనూరు ముచ్చట్లు:
443
రాష్ట్రంలో పేద ప్రజల కల నేరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 27 పట్టణంలో సుందరంగా 53,112 టిట్కో గృహాలు నిర్మించడం జరిగిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎంపీ రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్ శ్రీనివాసులతో కలసి టిట్కో గృహాలను ప్రారంభించారు. మొక్కలు నాటారు. అక్కడ జరిగిన సభలో లబ్దిదారులనుద్ధేశించి మంత్రి ప్రసంగిస్తూ పుంగనూరులో సుమారు రూ.10 లక్షలు విలువ చేసే స్థలంలో రూ. 6 లక్షలతో నిర్మించిన 1536 గృహాలు ప్రజలకు అందజేశాం. మహిళల ఆనందాలకు అవదులు లేవ్. జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసేందుకు మహిళలు ఉధ్యమిస్తున్నారు.

పేదల సొంత ఇంటి కల నేరవేరింది ..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడంతో మా ఆశలు నేరవేరాయి. నేను , నా భర్త , ఇద్దరు పిల్లలు సాధారణ జీవితం సాగిస్తున్నాం. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాకు ఇల్లు మంజూరు చేశారు. ప్రస్తుతం మంత్రి, కలెక్టర్‌తో కలసి జిల్లా యంత్రాంగం మా గృహప్రవేశాలకు రావడంతో మా ఆశలు నేరవేరింది. జగనన్నతో నాకు పక్కా ఇల్లు ఉందని ధీమాగా చెబుతున్నా.
– అమరావతి, లబ్ధిదారు. పుంగనూరు.
సొంతఇల్లు కట్టుకోలేనని అనుకున్నాము…
మేము సొంత ఇల్లు కట్టుకోలేం అనుకున్నాం. ఇరవై ఏళ్లుగా సంపాదించింది మాఖర్చులకే సరిపోయింది. ప్రస్తుతం టిట్కోలో సుందరమైన ఇల్లు కేటాయించారు. మేము ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రుణపడి ఉన్నాం. తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేలా ఉధ్యమిస్తాం.
– రమ్య, లబ్ధిదారు, పుంగనూరు.
జగనన్నతోనే మా అడ్రస్ …
సొంత ఇల్లులేని మాకు జగనన్న కాలనీలు, టిట్కోగృహాలలో ఇండ్లు నిర్మించి మాకు పక్కా అడ్య్రస్ సృష్టించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. మహిళలు జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ఉధ్యమిస్తాం.
– ,లబ్ధిదారు, పుంగనూరు.
Tags: Our hopes were dashed with Jagananna’s colonies
