Natyam ad

రోజమ్మతోనే మా ప్రయాణం-ఆమె గెలుపు … మా గెలుపు

– విభేదాలకు అపోహలే కారణమని స్పష్టమైంది.

-మళ్లీ ఏకమైన నేతలు
-మళ్లీ స్వంత కుటుంబంలోకి వచ్చినంత ఆనందంగా ఉందన్న నేతలు

 

పుత్తూరు ముచ్చట్లు:

Post Midle


వారందరూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనేతలే.. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడ్డవారే.. అయితే ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ విద్రోహులు మంత్రి ఆర్కేరోజాకు వారికి మధ్య అపోహలు సృష్ఠించడం దానికి సందర్భానుసారం పరిస్థితులు బలం చేకూరడంతో వారు మంత్రి ఆర్కేరోజాకు దూరంగా ఉంటూ వచ్చారు.వారికి సంబందించిన అనుచరులు టీడీపీ తీర్థం కూడా పుచ్చుకొన్నారు.అయితే కాలం వారి మధ్య ఉన్న దూరాన్ని తొలగించే పరిస్థితిని తీసుకువచ్చింది.నిజానిజాలను పార్టీ నేతలు తెలుసుకున్నారు.ఇంతకాలం మంత్రితో తమకున్న అనుబంధాన్ని దూరం చేసింది అపోహలే అని స్పష్టమైంది.ఇక ఒక్క క్షణం కూడా మంత్రి రోజాకు దూరంగా ఉండకూడదని మంత్రి ఆర్కేరోజా ఆమె భర్త ఆర్కే సెల్వమణి వద్దకు తమ బలగంతో పరుగుపరుగున వచ్చేశారు.అపోహల తెరలను వీడి ఆప్యాయతలను పంచుకున్నారు.రోజమ్మతోనే ఇక తమ ప్రయాణమని, ఆమె గెలుపు తమ గెలుపులా ఎన్నికల్లో పనిచేస్తామని ప్రకటించారు.ఈ కలయిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని ఇనుమడింపజేసింది.ఈ సంఘటన పుత్తూరు మండలం కేబీఆర్‌పురంలో చోటుచేసుకుంది.

 

 

కే బీ ఆర్‌ పురంకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ప్రతాప్, తిరుమలకుప్పం గ్రామానికి చెందిన సంపత్, కృష్ణసముద్రంకు చెందిన రవి, బాబు గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు తీవ్రంగా పనిచేశారు.కొన్ని అపోహలు మంత్రి ఆర్కేరోజాకు వారికి మధ్య దూరాన్ని పెంచింది.ఇటీవల సందర్భోచితంగా వారు కలుసుకున్న సమయంలో నిజానిజాలు తెలియవచ్చింది. ఇంతకాలం అనవసరంగా మంత్రికి దూరంగా ఉన్నామని తెలుసుకున్న వారు కేబీఆర్‌ పురం గ్రామానికి విచ్చేసిన మంత్రి వద్దకు వచ్చి కలుసుకున్నారు.ఇక మంత్రి వెంటే ఉంటామని ఆమె గెలుపే మా గెలుపని ఇక ఏ శక్తులు ఆమె నుంచి మమ్మల్ని విడధీయలేవని ప్రకటించారు. పార్టీకి దూరమై టీడీపీలోకి చేరిన వారి బలగాలను సైతం తీసుకువచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేర్చారు.నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చి కలుసుకోవడం పార్టీ బలాన్ని ఇనుమడింపజేసింది. కేబీఆర్‌ పురం జనంతో నిండింది.. విజయహోరు వినిపించింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దూరమైన సేనాధిపతులు మళ్లీ వచ్చారని రెట్టింపుబలం వచ్చిందని ఇది అధిక మెజారిటీతో గెలిపించే శుభపరిణామమన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Tags: Our journey is with Rojamma – her win … our win

Post Midle