మా మెంబర్ షిప్ లక్ష

Date:30/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మా అధ్యక్షుడు నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా కార్యవర్గం ఏర్పడిన తరవాత తొలిసారి భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సమావేశంలో 2019-21 గాను పలు కీలకనిర్ణయాలను తీసుకున్నారు.
✦ ‘మా’ హెల్ప్ లైన్..
మా సభ్యుల సౌలభ్యం కొరకు ‘మా’కు హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో మా సభ్యులు 9502030405 నంబర్‌కి ఫోన్ చేయవచ్చు.
✦ పెన్షన్‌పై చర్చ..
01.04.19 నుండి పెన్షన్‌ను 1000 రూపాయలు పెంచి 6000 రూపాయలు నేరుగా 30 మంది పెన్షన్ దారుని బ్యాంక్ ఖాతాలో జమచేయడమైనది. పెంచిన మొత్తం 1000 రూపాయలు పెన్షన్ దారునికి వైద్య ఖర్చుల నిమిత్తం ఉపయోగపడనుంది.
✦ ప్రభుత్వ పథకాలు ‘మా’కి వర్తింపు..
‘మా’ అతి త్వరలో సభ్యులందరికీ ప్రభుత్వ పథాకాలైన పెన్షన్, ఇల్లు, విద్య, కళ్యాణలక్ష్మి మొదలైన పథకాల వర్తించేలా చర్యలు.
✦ ‘మా’లో సభ్యత్వం లక్ష..
‘మా’లో కొత్తగా సభ్యత్వం తీసుకునే వారి గురించి రెండు రకాల పద్దతులలో సభ్యత్వములను ప్రవేశపెట్టారు.
తొలి దశలో రూ.25,000 చెల్లించి గోల్డ్ కార్డ్‌ను తీసుకోవచ్చు. ఈ గోల్డ్ కార్డ్ సమయ కాలం రెండు సంవత్సరములు. ఈ రెండు సంవత్సరములలో మిగతా రూ. 75,000 వాయిదాల పద్ధతిలో చెల్లించబడి మొత్తం రూ.1,00,000 పూర్తి అయిన వెంటనే జీవిత కాల సభ్యత్వ కార్డు మంజూరు చేస్తారు. అప్పటి వరకూ అసోషియేట్ సభ్యునిగానే పరిగణించబడతారు. వీరికి ‘మా’ నుండి ఏ రకమైన సౌలభ్యములు వర్తించవు. కేవలం ఫ్రీ మెడికల్ క్యాంప్స్‌ మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు.
రెండో పద్దతి ప్రకారం ఒకేసారి సభ్యత్వ రుసుము రూ. 99,000 చెల్లించినచో సభ్యత్వం ఇవ్వబడుతుంది. దీని వలన జీవిత కాల సభ్యత్వం పొందిన వారికి 10,000 రాయితీగా పొందగలుగుతారు. ఈ సదుపాయం 100 రోజులు మాత్రమే అమలులో ఉంటుంది.
✦ ఉచిత ఎస్.బి.ఐ సంపూర్ణ సురక్ష జీవిత భీమా..
ఈ పాలసీ ప్రకారం ప్రతి యొక్క సభ్యునికి 2,00,000 ఎస్.బి.ఐ జీవిత భీమా పాలసీ ఇవ్వబడును. ఈ పాలసీలో యాక్సిడెంటల్ సహజ మరణం సంభవించునో సభ్యుని యొక్క కుటుంబానికి 2,00,000 ఇవ్వబడును. ఈ పాలసీ 15.07.18‌లో లాప్స్ అయ్యింది. దీంతో కొత్త కొటేషన్స్ తీసుకుని రూ. 1,00,000 రూపాయిలు పెంచి రూ. 3,00,000 కవరేజ్‌ని 29.03.19 నుండి 321 మందికి కవరేజ్ రానుంది.
Tags: Our membership ship is a lakh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *