బాధితులకు న్యాయం జరిగేవరుకు మా పార్టీ అండగా ఉంటాం 

Date:11/08/2020

కౌతాళం ముచ్చట్లు:

సామాన్యులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ అధికారి ఎస్ ఐ నాగార్జున రెడ్డి విఫలం అయ్యారని,పాలకులకువత్తాసు పలుకుతున్నారని బాధితులకు న్యాయం చేసేంత వరకు మా బిజేపీ పార్టీ అండగా ఉంటుందని మంత్రాలయం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పురుషోత్తం రెడ్డి జిల్లా కిషన్ మోర్ఛా అధ్యక్షులు రామకృష్ణ మండిపడ్డారు.వారు మాట్లాడుతూ గ్రామంలో రోజురోజుకూ అరాచకాలు వైసీపీ పాలకులు చేస్తుంటే వారికే వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సామాన్యులకు న్యాయం చేయలేని వారు అధికారం లో ఉండటం ఎందుకని వైసీపీ పార్టీ కార్యకర్తలుగా ఉండటం మంచిదని ప్రభుత్వం లో ఉండి జీతాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో దౌర్జనానికి పాల్పడు తుంటే సామాన్యు ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేయలేక వారిమీద కేసులు పెట్టి బయపెట్టడం ఎంతవరకు సమంజసం కాదని మా బాధితులకు పార్టీ అండగా ఉంటూ న్యాయం చేసేవరకు ఎస్ ఐ పై కఠిన చర్యలు తీసుకునే వరకు వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అందరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

సీఎం ఆర్థిక సహాయం రూ.55 వేలు

Tags:Our party will stand by the victims until justice is done

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *