మనగుడి” పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరణ 

Our "posters and pamphlets are innovative

Our "posters and pamphlets are innovative

Date:17/08/2018
తిరుపతి ముచ్చట్లు:
ప్రఖ్యాత హైందవ దార్మిక సంస్థ  టిటిడి ధర్మప్రచారంలో భాగంగా ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ”మనగుడి” పోస్టర్లు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో పోల భాస్కర్
అవిష్కరించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందు శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ రెండు తెలుగు
రాష్ట్రాలలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన 12 వేలకు పైగా ఆలయాలలో మనగుడి
కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు అన్ని ఆలయాలకు శ్రీవారి కంకణాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, కలకండ, ఇతర పూజ సామగ్రిని ప్యాక్చేసి ఆయా ఆలయాలకు
ధర్మప్రచార పరిషత్ విభాగం ద్వారా పంపిణీ చేయనున్నట్లు వివరించారు.  ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేకాధికారి  మునిరత్నంరెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి
రమణప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:Our “posters and pamphlets are innovative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *