ఆత్మగౌరవం కల్పించిన టిఆర్ఎస్ కు మా మద్దతు 

– ఎంపీ కవిత ను కలిసిన సంచార జాతుల సంఘం
Date:23/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
అధికార పార్టీ టిఆర్ఎస్ కు తెలంగాణ సంచారజాతుల సంఘం మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని స్పష్టం చేసింది. మంగళవారం హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో తెలంగాణ సంచార జాతుల సంఘం కు చెందిన 80 కులాల నేతలు నేతలు కలిశారు. అన్ని వర్గాలకు, కులాలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంచార జాతులకు కూడా మేలు చేస్తున్నారని ఇందులో భాగంగానే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ప్రతినిధులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 70 ఏళ్లుగా సంచార జాతులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచార జాతులకు గుర్తింపు కోసం, అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు..
మా జాతుల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ లోని ఉప్పల్ భగాయత్ లో పది ఎకరాల భూమిని సంచార భవన్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించి రూ. పది కోట్లు మంజూరు చేశారని తెలిపారు. స్వరాష్ట్రంలో, స్వయం పాలన లో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో సంచార జాతులు అంతా టిఆర్ఎస్ వెంట ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా సంచార జాతులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఎంపీ కవిత దృష్టికి తీసుకువచ్చారు.
2015లో సంచార జాతుల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు 2015లో కేంద్ర ప్రభుత్వం బిక్కు రాంజీ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిందని, కమిషన్  కేంద్రంకు నివేదిక ఇచ్చినా.. కమిషన్ సిఫారసులను బహిర్గతం చేయడం కానీ, అమలుకు చేయడం కానీ చేయలేదన్నారు.  స్పందించిన ఎంపి కవిత ఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకువెళ్లి కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిని కల్పిస్తానన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా సంచార జాతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయించాలని, గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షల నుంచి మినహాయించి, ఉచితంగానే అడ్మిషన్లు కల్పించాలని వారు కోరారు.
ఎంపి కవిత ను కలిసిన వారిలో సంచార జాతులుగా గుర్తింపు పొందిన సంఘాలు,  గుర్తింపు లేని సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ లలో ఉన్న సంచారజాతుల సంఘాల నాయకులున్నారు.  తెలంగాణ సంచారజాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, వంశరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వొంటెద్దు నరేందర్, అధ్యక్షులు వై. వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి, వడ్డెర సంఘం నాయకులు పల్లపు సమ్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వీరస్వామి, ఉపాధ్యక్షులు విశ్వేశ్వరయ్య, వీరభద్రీయ సంఘం అధ్యక్షులు వెన్నెల నాగరాజు, రెడ్డికా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, గంగిరెద్దుల, గోత్రాలు, దొమ్మర, మొండివారు, పూసల, మందుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు జడ్డి కనకయ్య, తిపిరిశెట్టి శ్రీనివాస్,ఆరే రాములు, చెన్నయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్,లతో పాటు జానపద కళాకారుడు గొడ్డలి నర్సన్న, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు మేడే రాజీవ్ సాగర్ ఎంపి కవిత ను కలిసిన వారిలో ఉన్నారు.
Tags:Our support for TRS, which provided self-esteem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *