పెద్ద ఎత్తున ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’

Our 'Telangana-Our Agriculture'

Our 'Telangana-Our Agriculture'

Date:16/03/2019
వరంగల్ ముచ్చట్లు:
వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే దిశలో భాగంగా మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017 ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతు సదస్సులను నిర్వహించడం. రైతు శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ, ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహించడం. క్షేత్రస్థాయిలో మహిళారైతులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రకమైన చర్యలతో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో వ్యవసాయంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 56 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. చేపల పెంపకం విస్తీర్ణంతో కలిపి 110 లక్షల ఎకరాల్లో సేద్యం సాగవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్స్  ఇరిగేషన్ విధానాలను అమల్లోకి తీసుకువచ్చారు. వరిపంటకు ఎక్కువ నీరు అవసరం అవుతోంది. ఒక ఎకరానికి వరికి అవసరమైన నీటితో ఇతర పంటలు మూడు ఎకరాల వరకు సాగు చేసేందుకు వీలవుతుందని లెక్కలు వేశారు. అందుకే వరికి ప్రత్యామ్నాయ పంటలుగా మొక్కజొన్న తదితర తృణధాన్యాలను, కాయగూరల పంటలను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించారు. రైతులు పంటలపై పెట్టేపెట్టుబడి తగ్గించేందుకు సబ్సిడీపై విత్తనాలను ఇవ్వడమే కాకుండా, భూసార పరీక్షలను చేపట్టి రైతులందరి భూముల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల రైతులు అవసరమైన ఎరువులను మాత్రమే ఉపయోగించేందుకు వీలవుతోంది. దీంతో పెట్టుబడిలో దాదాపు 20 శాతం నుండి 30 శాతం వరకు తగ్గుదల ఉంటుందని అంచనావేశారు. యాంత్రిక సేద్యాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను ఇస్తున్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి చేసేందుకు విత్తన గ్రామంకార్యక్రమం చేపడుతున్నారు. మొక్కజొన్న, సోయా,పప్పుదినుసులు పంటల విత్తనాలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు.వరి, మొక్కజొన్న, పప్పు్ధన్యాలు, నూనెగింజలైన ఆముదం,సోయా, వేరుసెనగ పంటల్లో సమూహాలను నెలకొల్పుతున్నారు.రైతుల్లో అవగాహన పెంచేందుకు క్షేత్రస్థాయిలోపరిశీలన పర్యటన చేపట్టాలని నిర్ణయించారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని నిర్ణయించారు.వ్యవసాయ విస్తరణ సమర్థతగా చేపట్టడం. సమగ్ర పోషణ యాజమాన్యం, సమగ్ర పురుగుమందులయాజమాన్యం, సమగ్ర నీటియాజమాన్యం ద్వారా సమగ్ర పంటలయాజమాన్యాన్ని ప్రోత్సహించడం.సేంద్రీయ వ్యవసాయానికి భారీ ఎత్తున సబ్సిడీ ఇస్తూ,ప్రోత్సహించడం.ప్రకృతి వైపరీత్యాలైన కరవు, వరదలు, వడగండ్ల సమయాల్లో విపత్తు యాజమాన్యం సమర్థతగా నిర్వహించడం.వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం.రైతులకు సకాలంలో రుణాలను అందించే ఏర్పాట్లు చేయడం.ఇంటర్నెట్, అగ్రిస్‌నెట్ ద్వారా పంట ఉత్పత్తి, ఉత్పాదకాలసరఫరా, మార్కెటింగ్ సమాచారం అందించడం.కేంద్ర సహాయ పథకాలు, రాష్ట్ర ప్రణాళికా పథకాలనుసమర్థతగా అమలు చేయాలని నిర్ణయించారు.
Tags:Our ‘Telangana-Our Agriculture’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *