అదుపు తప్పిన లారీ..ఇద్దరు మహిళల దుర్మరణం

అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం, కాలువ పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన మీద నిల్చున్న మహిళలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళల మృతదేహాలు మాంసపు ముద్దల్లా మారాయి. పేరూరు డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదలడంతో చూసేందుకు మహిళలు వచ్చారు. ఈ ప్రమాదంలో సరస్వతి, లక్ష్మీదేవి అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత లారీ ఆగకుండా వెళ్లిపోవడంతో గ్రామస్తులు వెంబడించి కాల్వపల్లి సమీపంలో పట్టుకుని, పోలీసులకు సమాచారం అందించారు.

 

Tags: Out of control lorry.. Two women died

Leave A Reply

Your email address will not be published.