పుంగనూరులో బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

పుంగనూరు ముచ్చట్లు:

బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని, జగనన్న కానుక అందరికి అందించి , ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సర్వశిక్షా అభియాన్‌ సమన్వయకర్త అజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పలు పాఠశాలను ఎంఈవో కేశవరెడ్డితో కలసి సందర్శించి, బయోమెట్రిక్‌ను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో పలు విషయాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును అటెండెన్స్యాప్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి అవగాహన కల్పించాలన్నారు. నాడు-నేడు రెండవ విడత పనులను నిర్ధేశించిన లోపు పూర్తి చేయాలని సూచించారు. ఈయన వెంట ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

 

Tags: Out-of-school children in Punganur should be enrolled in schools

Leave A Reply

Your email address will not be published.