ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఔట్ సౌర్సింగ్ ఉద్యోగులు

Date:24/09/2020

నెల్లూరు ముచ్చట్లు

సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఔట్ సౌర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కొండాయపాలెం గేట్ ఉప సంచాలకుల కార్యాలయం వెలుపల పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. 2015 -16 ఆర్థిక సంవత్సరం లో 262 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రావలసిన 8 నెలల వేతనం కోటి 40 లక్షల నగదును విడుదల చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లం సురేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి పాత వేతన బకాయిలు కోసం అనేకమార్లు అధికారులు కలవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించడం పట్ల ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రస్తుత సాంఘిక సంక్షేమ శాఖ నెల్లూరు జిల్లా డిడి పాత వేతన బకాయిలు విషయమై పలుమార్లు ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ తో సంప్రదింపులు జరిపి, జీతాలు మంజూరు అయ్యేలా కృషి చేశారని తెలిపారు.

 

ప్రస్తుతం కరోనా  నేపద్యంలో వసతి గృహాలు మూసి వేసి ఉండడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఉద్యోగుల వినతి మేరకు ముఖ్యమంత్రి  మానవతా దృక్పథంతో ఆలోచించి వేతన జీవుల ఆకలి తీర్చుట లో భాగంగా జూన్, జూలై ,ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో గాను జీతాలు చెల్లించాలని  ఉత్తర్వులు పంపడంతో ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని తెలిపారు . అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కొరకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి  నెల నెల వేతనాలు వచ్చేటట్లు చేసి ,ప్రైవేటు ఏజెన్సీల దోపిడిని అరికట్టి ,మా  బాధల నుంచి విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప సంచాలకులు బి .జీవ పుత్ర కుమార్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు వడ్ల పల్లి బాబు, పొంగూరు సుబ్రహ్మణ్యం, బల్లి పెంచలయ్య, తాళ్లూరు రాధమ్మ, కడివెడు కోదండరామయ్య, అక్కివరం సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, ఓజిలి సుబ్రహ్మణ్యం, సుశీల భూదేవి, లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ పునఃప్రారంభించాలని కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం

Tags:Outsourcing employees anointed to portray the Chief Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *