Over 700 Tabliq Jamaat members from Delhi to be sent to Tamil Nadu

ఢిల్లీ నుంచి 700 మంది తబ్లీగ్ జమాత్ సభ్యులు ప్రత్యేకరైలులో తమిళనాడుకు…

Date:16/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో చిక్కుకుపోయిన 700 తబ్లీగ్ జమాత్ సభ్యులు శనివారం మధ్యాహ్నం ప్రత్యేకరైలులో తమ సొంత రాష్ట్రమైన తమిళనాడుకు బయలుదేరారు. నిజాముద్దీన్ లోని మర్కజ్ లో తబ్లీగ్ సమావేశంలో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి ఢిల్లీ వచ్చిన సభ్యులు కరోనా బారిన పడటంతో వారిని ఢిల్లీలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.కరోనా నుంచి బయటపడటంతో 700 మంది జమాత్ సభ్యులను క్వారంటైన్ కేంద్రం నుంచి పాత ఢిల్లీ రైల్వేస్టేషనుకు ప్రత్యేక బస్సుల్లో తరలించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి కె పళనీస్వామి వినతి మేర జమాత్ సభ్యులను కేంద్రం ప్రత్యేక రైలులో తమిళనాడుకు తరలిస్తున్నారు. తబ్లీగ్ జమాత్ సభ్యులను క్వారంటైన్ చేసి ఐదు వారాలు దాటిన నేపథ్యంలో వారిని విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి వారిని క్వారంటైన్ కేంద్రం నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటుచేయడం కోర్టులో పిటిషన్ ను వాపసు తీసుకున్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య.

Tags: Over 700 Tabliq Jamaat members from Delhi to be sent to Tamil Nadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *