యానంలో గవర్నర్ పర్యటన
యానం ముచ్చట్లు:
కోనసీమ జిల్లా యానాం వరద ప్రాంతాల్లో పుదుచ్చేరి ఇన్చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరాజన్ పర్యటించారు. హైదరాబాదు నుండి విమానంలో రాజమండ్రి వచ్చిన ఆమె రోడ్డు మార్గాన యానాం చేరుకున్నారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ తమిళసై… అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తరువాత ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు బాధితులకు పరామర్శించారు. ఆమె వెంట ప్రజా పనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి సాయి శర్వాణన్, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తదితరులున్నారు.
Tags: overnor’s visit to Yanam