ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాలి – ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ముందు కాంగ్రెస్ ధర్నా

పెద్దపల్లి  ముచ్చట్లు :

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం వెంటనే వేగవంతం చేయాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రాజేష్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ ను సందర్శించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించి ఆస్పటల్ సూపరిండెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సెకండ్ వేవ్  కరోనాతో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో  చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసయాని అన్నారు. అందుచేత మనకు ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ఈ పరిస్థితుల్లోనైనా స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇక్కడ జరుగుతున్న ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యత వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు కలెక్టర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని అన్నారు. తక్షణం ఎమ్మెల్యే  మరియు మేయర్ స్పందించి ఆక్సిజన్ ప్లాంట్ పనులు వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి స్వామి, ఎం.రవికుమార్, కొలిపాక సుజాత మల్లయ్య, నగునూరి సుమలత రాజు, ఎండీ ముస్తాఫా, ముదాం శ్రీనివాస్, గట్ల రమేశ్, మిట్టపల్లి మహేందర్, మధుకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సమ్మెట స్వప్న, పొన్నం స్వరూప, వనమాల, వజిదా పర్విన్, పీక అరుణ్ కుమార్, సిరిపురం మహేష్, ప్రవీణ్, వికాస్, వంశీ, సాయి కృష్ణ, నంది వెంకటేష్, దుర్గా  తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Oxygen plant construction should be accelerated
– Congress dharna in front of mine government hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *