నెల్లూరుకు బయల్దేరిన ఆక్సిజన్ ప్లాంట్

మాట నిలుపుకున్న రియల్ హీరో సోనుసూద్
నెల్లూరు కు మరో వారం లో చేరిక

నెల్లూరు ముచ్చట్లు:

 

 

కరోనా కష్టకాలంలో సోనూ సూద్ రియల్ హీరో గా మారిపోయి తనవంతుగా చేయూత అందిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. నెల్లూరు జిల్లా ప్రజలు ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ విషయం తెలుసుకున్న సోనూ సూద్ నెల్లూరుకు ఆక్సిజన్ ప్లాంట్ ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇచ్చిన మాట ప్రకారం ఆయన తన సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ ను నెల్లూరు జిల్లా అధికారులు అందుకుని అనంతరం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ లో దీనిని ఏర్పాటు చేస్తారు. గుజరాత్లోని గజియాబాద్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ బయలుదేరిందని మరో వారంలో నెల్లూరుకు చేరుకుంటుందని సోనూసూద్ మిత్రులు మైనార్టీ నేత సమీర్ పేర్కొన్నారు. రోడ్డు మార్గాన ఇప్పటికే బయలుదేరిందని రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి నెల్లూరుకి చేరుకుంటుందన్నారు. నెల్లూరు జిల్లా ప్రజల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ను పంపిన సోనూసూద్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Oxygen plant leaving for Nellore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *