రైల్వే స్టేషన్ లో పీఏసీ తనిఖీలు

Date:17/08/2019

సికింద్రాబాద్  ముచ్చట్లు:

రైల్వే బోర్డు కు సంబంధించిన రైల్వే పి ఏ సి కమిటీ బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తనిఖీ చేశారు..చైర్మన్ కిషన్ దాస్ తో కూడిన నలుగురు సభ్యులు  రైల్వేస్టేషన్ అంతటా తిరుగుతూ

ప్రయాణికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని రైల్వే బోర్డు మీటింగ్ లో వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఈ

సందర్భంగా వారు మాట్లాడుతూ  కాచిగూడ రైల్వే స్టేషన్ లో పట్టాలపై పరిశుభ్రతను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ లో ముఖ్యంగా ప్రయాణికులకు పార్కింగ్

సమస్య ఉందని, వాటిని పరిశీలించిన అనంతరం అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. .ప్రతి నెలా జరిగే రైల్వే బోర్డు మీటింగ్ లో ప్రయాణికుల సమస్యలు, వసతులు, మౌలిక సదుపాయాలలను

అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత ప్రభుత్వాల కంటే మోడీ హయాంలో రైల్వే వ్యవస్థ మెరుగుపడిందని,  ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారని అన్నారు.  రైల్వే లో వస్తున్న

మార్పుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. .కాచిగూడ లో ప్రయాణికుల సౌకర్యార్థం మ్యూజియంను ఏర్పాటు చేశారని,  ఐ ఆర్ టి సి పెయిడ్ సిస్టం లో నూతన విధానాలు తీసుకురావడం

వల్ల  రైలు సమయానికి రాకపోయినప్పటికీ  అక్కడ గడిపే వీలుందని అన్నారు. కేవలం 50 రూపాయలతో హెల్త్ చెకప్ లో కూడా చేయించుకునే అవకాశం కల్పించారన్నారు..ముఖ్యంగా రైల్వేస్టేషన్లలో

ప్లాస్టిక్ వాడకాన్ని  నిషేధించేందుకు కృషి చేస్తున్నామని,  వాటికి అనుగుణంగా క్రషింగ్ పాయింట్లు కూడా నెలకొల్పమన్నారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు, టాయిలెట్లు, ఆహారం విషయంలో ప్రయాణికులు

సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామన్నారు  జనరల్ టికెట్ ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించిన కాకుండా యు టి ఎస్

అనే యాప్ ను కూడా తయారు చేసినట్లు ఆన్లైన్ ద్వారా వారి టికెట్లు పొందవచ్చని  వెల్లడించారు.

కొల్లాపూర్ లో ఎమ్మెల్యే పర్యటన

Tags: PAC checks in railway station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *