పెద్ది రెడ్డి టార్గెట్..ఏంటీ

కరీంనగర్  ముచ్చట్లు:

మ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డికి ఈటల రాజేందర్ రాజీనామాతో ఎక్కడలేని ప్రచారం లభిస్తుంది. పెద్దిరెడ్డి ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ హాయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం సుతారమూ ఇష్టంలేని పెద్దిరెడ్డి ఇప్పుడు అధికార పార్టీ పెద్దల నేతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు.పెద్దిరెడ్డి అనేక పార్టీలు మారారు. తొలుత టీడీపీ లో ఉన్న పెద్దిరెడ్డి హుజుారాబాద్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో పెద్దిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై హుజూరాబాద్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి ప్రజారాజ్యం పార్టీలోకి మారారు. అక్కడి నుంచి పోట ీచేసినా విజయం సాధించలేదు. తిరిగి టీడీపీలోకి వచ్చారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పెద్దిరెడ్డి రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు.అయితే టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన పెద్దిరెడ్డి మరోసారి హుజూరాబాద్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో పెద్దిరెడ్డి ఇరకాటంలో పడ్డారు. తనకు నియోజకవర్గంలో ఉన్న కొద్దో గొప్పో పట్టు కోల్పోతామని భావించారు. అందుకే ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం కావాలని, కోరి తెచ్చుకున్న ఈటల పై తానేం వ్యాఖ్యలు చేసినా ప్రయోజనం లేదని పెద్దిరెడ్డికి తెలియంది కాదు.అయితే టీఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో పడేందుకే పెద్దిరెడ్డి ఈ హంగామా చేస్తున్నారని తెలిసింది. నిజానికి దశాబ్ద కాలంగా పెద్దిరెడ్డి రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయారు. ఇప్పుడు ఈటలకు వ్యతిరేకంగా గళం విప్పితే కొంత తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. అందుకే పెద్దగా రాజకీయంగా ఎవరూ పరిగణనలోకి తీసుకోకపోయినా పెద్దిరెడ్డి ఈ హంగామా చేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Paddi Reddy Target..MT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *