వరి కొనుగోళ్లు షురూ…

Paddy purchases

Paddy purchases

Date:16/12/2019

విశాఖపట్టణం ముచ్చట్లు:

జిల్లాలో వరి సాగుకు అనుకూలమైన భూమి విస్తీర్ణం 1,07,428 హెక్టార్లు. దీనిలో సాధారణంగా సాగు అయ్యే విస్తీర్ణం 1,02,312 హెక్టార్లు. ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 97,251 హెక్టార్లలో వరి సాగు అయ్యింది. వర్షాలు అనుకూలించడంతో దిగుబడి పెరిగిందని రైతులు ఆనందంలో ఉన్నారు. దాదాపు 3,68,752 మెట్రిక్‌ టన్నుల వరకూ ఉంటుందని అంచనా. దీనిలో రైతులు సొంత వినియోగానికి 1,08,657 మెట్రిక్‌ టన్నుల వరకూ మినహాయించుకున్నా, మిగతా 2,60,095 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి రావాల్సి ఉంది. జిల్లాలో 34 రైస్‌మిల్లులు ఉన్నాయ జిల్లావ్యాప్తంగా 55 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ)ను పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసింది. వీటిలో ఐదు వెలుగు (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. చోడవరం వ్యవసాయ మార్కె ట్‌ యార్డు, యలమంచిలి మండల సమాఖ్య (లైన్‌ కొత్తూరు), నాతవరం మండల సమాఖ్య, నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ యార్డు, పద్మనాభం మండల సమాఖ్య ఆవరణల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగతా 50 పీపీసీలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)ల్లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు వీటిని తెరుస్తారు. ఇవన్నీ మార్చి నెల వరకూ పనిచేస్తాయి.రైతుల వద్ద తక్కువ ధరకు ముందుగానే ధాన్యాన్ని కొనేసి లబ్ధి పొందుతున్న దళారీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు తాము సాగు చేసిన పంటను ధాన్యం రకాలతో సహా ఈ–క్రాప్‌లో విధిగా నమోదు చేయించుకోవాలి. ఇందుకోసం సంబంధిత మండల వ్యవసాయాధికారిని లేదా వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించాలి.

 

 

 

 

 

 

 

గ్రామ సచివాలయంలోని గ్రామ వ్యవసాయ సహాకుల సలహా, సహకారాలు తీసుకోవచ్చు. కౌలురైతులు రుణ అర్హతపత్రం లేదా సాగు ధ్రువీకరణ పత్రం సంబంధిత కార్యాలయం నుంచి పొందాలి. ధాన్యం కొనుగోలు సమయంలో వెబ్‌ల్యాండ్‌/ఈ–క్రాప్‌లో నమోదైన వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. దళారీలకు అడ్డుకట్ట వేసి నిజమైన రైతులకు న్యాయం చేయడానికి ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే నాలుగైదేళ్లుగా తమ మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరు నమోదుచేసుకోని రైతులు ఎవ్వరైనా ఉంటే తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం ఆధార్‌కార్డు, పాసుపోర్టు సైజ్‌ ఫొటోతో పాటు బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసుపుస్తకం కాపీలను తీసుకెళ్లాలి. అంతకన్నా ముందు అసలు బ్యాంకు ఖాతా మనుగడలో ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలి. పనిచేయని ఖాతా నంబరు ఇస్తే ధాన్యం ధర చెల్లింపు విషయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే రైతులు తాము ఏ రోజు పీపీసీకి తీసుకొచ్చేదీ ముందుగానే అక్కడి సిబ్బందికి తెలియజేయాలి.

 

 

 

 

 

 

అందుకోసం టోకెన్‌ తీసుకోవాలిధాన్యానికి కనీస మద్ధతు ధరలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,815 చొప్పున, ఏ గ్రేడు రకం ధాన్యానికి రూ.1,835 చొప్పున ధర రైతులకు చెల్లించాల్సి ఉంది. అలాగే ఈ ధాన్యం సేకరణలో పాటించాలి్సన నాణ్యత ప్రమాణాల వివరాలను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నారు. ధాన్యంలో మట్టిరాళ్లు, ఇసుక తదితర వ్యర్థాలు, గడ్డి, చెత్తతాలు, పొట్టు 1 శాతం వరకూ ఉండవచ్చు. చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు తొలచిన ధాన్యపు గింజలు 4 శాతానికి మించకూడదు. పరిపక్వంకాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన గింజలు 3 శాతం వరకూ ఉండవచ్చు. ఏ గ్రేడు ధాన్యంలో కేళీలు 6 శాతం మించి ఉండకూడదు. ఏ గ్రేడు, సాధారణ రకాలైన సరే తేమ 17 శాతం వరకే ఉండాలి.

 

సహకారానికి బలం 

 

Datre:Paddy purchases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *