పద్మజ ఓకే… ఒత్తిడిలోనే పురుషోత్తమ్

Date:23/02/2021

విశాఖపట్టణం ముచ్చట్లు:

ఏపీలో సంచలనంరేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె ఇద్దరు అమ్మాయిల హత్యకేసులో నిందితులు పురుషోత్తం, పద్మజలకు విశాఖలోని మానసిక చికిత్సాలయంలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. భార్య భర్తలను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆష్పత్రి 4వ యూనిట్‌లోని అరుంధతి వార్డులోపద్మజ.. శ్రీకృష్ణ వార్డులో పురుషోత్తం నాయుడును వేర్వేరుగా ఉంచారు. నిందితులు ఇద్దరు చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పురుషోత్తం నాయుడు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నట్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని.. క్లోజ్డ్ వార్డు వద్ద సెక్యురిటీగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లలను ఏర్పాటు చేశారు. నిందితులు పూర్తిగా కోలుకున్నాక జైలు అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు.పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులను జనవరి 24న తమ కన్నబిడ్డలైన అలేఖ్య, సాయిదివ్యను హత్య చేశారు. ఈ కేసులో వారిని జైలుకు తరలించారు. రెండు రోజులకే పద్మజ అరుపులు, కేకలతో ఖైదీలు భయపడిపోయారు. మదనపల్లె సబ్ జైలులో ఉన్న పద్మజ దెబ్బకు జైల్లో ఖైదీలు వణికిపోయారు. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతమవుతుంది అని పెద్దగా కేకలు వేశారు.పద్మజ ఉంటున్న బ్యారక్‌లో మహిళా ఖైదీలు రాత్రిళ్లు నిద్రించాలంటే భయపడ్డారు. పద్మజ దెబ్బకు ఆందోళనకు గురైన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారు. పురుషోత్తంనాయుడు కూడా ఒంటరిగా కూర్చొని ఒక్కోసారి ఏడ్చారు. దీంతో జైలు సిబ్బంది అధికారులతో మాట్లాడి తిరుపతి రుయాకు తరలించగా.. మానసిక వైద్యనిపుణులు వారిని చికిత్స నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించాలని రిఫర్‌ చేశారు. నిందితులు పురుషోత్తం, పద్మజలను విశాఖ తరలించారు.. ఇద్దర్ని విశాఖ మానసిక చికిత్సాలయంలో చేర్చారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Padmaja OK … Purushottam under pressure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *