పగలే ఫాగింగ్‌

Pagale Fogging

Date:20/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పగటి పూట చేపట్టారు. సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ మదుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలో ఫాగింగ్‌ చేపట్టారు. కాగా మున్సిపాలిటిలో పారిశుద్ధ్యంలోపించి, దోమల బెడద తీవ్రమైందని ప్రజలు తెలియజేశారు. ఈ విషయమై కమిషనర్‌ చర్యలు చేపట్టారు. సాధారణంగా సాయంత్రం సమయంలో మాత్రమే ఫాగింగ్‌ చేపట్టేవారు. కానీ సాక్షి కథనాలపై స్పందించిన కమిషనర్‌ ఉదయం నుంచి ఫాగింగ్‌ చేపట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నామన్నారు. కానీ కార్మికులు శుభ్రం చేసిన తరువాత ఆ ప్రాంతంలో చెత్త వేయడంతో మరుసటి రోజు వరకు ఆ చెత్త నిల్వ ఉంటోందన్నారు. ఈ విషయంలో ప్రజలు తగిన చర్యలు తీసుకుని, చెత్తను ఉదయం పూట వేయాలని సూచించారు. అలాగే చెత్తను డస్ట్బిన్లలో వేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించి, స్వచ్చ పుంగనూరుగా చేసుకునేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు, కార్మికులు పాల్గొన్నారు.

 

మున్సిపల్‌ ఓటర్ల సర్వేకు సహకరించండి

Tags: Pagale Fogging

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *