పెండింగ్ చాలన్ల చెల్లింపుపై రాయితీని సద్వినియోగం చేసుకోవాలి..

మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్

మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చాలన్ల చెల్లింపుపై కల్పించిన భారీ రాయితీ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి. 2 & 3వీలర్ వాహనాలపై 75% రాయితీ, 4 వీలర్ & హెవీ వాహనాలపై 50% రాయితీ, RTC వాహనాలపై 75% రాయితీలు ఉందని ఈ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని కోరారు. ఈ చాలాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి వాహనం నంబర్ నమోదు చేస్తే పెండింగ్ జరిమానా వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. వాహదారులు త్వరగా జరిమానాలు చెల్లించి ట్రాఫిక్ పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. కోర్టులో లోక్ ఆధాలత్ నడుస్తున్నందున ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులు కోర్టులో హాజరుకాగలరని. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వాహనాలు పోలీసు స్టేషన్లో ఉన్నందున అట్టి వాహనదారులు సరిఅయిన ధ్రువపత్రాలు పోలీసుస్టేషన్ లో సమర్పించి తమ వాహనాలను తీసుకుపోగలరు అని సిఐ గారు పేర్కొన్నారు..

Leave A Reply

Your email address will not be published.