ఎఫ్-16 యుద్ధ విమానాలను పాక్ దుర్వినియోగం

Pak fraudulent F-16 warplanes

Pak fraudulent F-16 warplanes

Date:06/03/2019
లాహోర్ ముచ్చట్లు:
ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సందర్భంగా మన భూభాగంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ ప్రయోగించింది. సరిహద్దుల్లోని తమ సైనిక, ఆయుధ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎఫ్-16 యుద్ధ విమానాలను పాక్ పంపినట్టు భారత్ ఆరోపించింది. వీటికి సంబంధించిన ఆధారాలను కూడా అమెరికాకు భారత్ సమర్పించింది. దీనిపై స్పందించిన అగ్రరాజ్యం, తమ నుంచి కొనుగోలు చేసిన ఎఫ్ 16 యుద్ధ విమానాలను దుర్వినియోగం చేసిందన్న అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నట్లు  శ్వేతసౌథం డిప్యూటీ అధికార ప్రతినిధి రాబర్ట్ పలాడినో తెలియజేశారు. కేవలం ఎఫ్-16 ద్వారా మాత్రమే ప్రయోగించగలిగే అమ్రామ్ క్షిపణి శకలాలు లభించినట్లు ప్రకటించిన వైమానిక దళం, అందుకు సంబంధించిన ఆధారాలను కూడా మీడియా ముందు కూడా ప్రదర్శించింది. అయితే, ఎఫ్-16 జెట్లను తాము వినియోగించలేదని పాక్ కొట్టిపారేస్తోంది. ఎఫ్-16 యుద్ధ విమానాలను పాక్ దుర్వినియోగం చేసిందే అంశంపై మరింత సమాచారం తెప్పించుకుంటున్నామని, దీన్ని ఇప్పుడే ధ్రువీకరించలేమని పలాడినో తెలిపారు.
కానీ భద్రతా, ద్వైపాక్షిక నిబంధనల దృష్ట్యా ఈ విషయంలో మరిన్ని విషయాలను బయటికి వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రస్తుతం నెలకున్న ఘర్షణ వాతావరణం, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, కూర్చుని మాట్లాడుకోవాలని ఇరు దేశాలకూ సూచించామని, ఈ విషయంలో తమవంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. పుల్వామా ఆత్మాహుతి దాడి అనంతరం పాక్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ సైతం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య గగనతల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మిగ్-21 విమానాలను భారత్ వినియోగించింది. పాక్ మాత్రం అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను వాడినట్లు భారత వాయుసేన ప్రకటించింది. ఎఫ్-16 జెట్లను కొనుగోలు చేసిన సందర్భంలో కేవలం స్వీయ రక్షణకు మాత్రమే వినియోగించేలా అమెరికాతో పాక్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ నిబంధనలను అతిక్రమించి భారత్పై దాడులకు ఉపయోగించింది.
Tags:Pak fraudulent F-16 warplanes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *