అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునకు పాక్ మద్దతు

Pak support for international court ruling

Pak support for international court ruling

Date:01/01/2019
ఇస్లామాబాద్ ముచ్చట్లు:
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్(47) కేసును పోలిన మరో ఉదంతంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పునకు పాక్ మద్దతు తెలిపింది. తద్వారా జాదవ్ కేసులోనూ భారత వాదనకు పరోక్షంగా బలం చేకూర్చినట్లయ్యింది. 2004 నాటి కేసులో.. ఉరిశిక్ష విధించిన అవెనా, పలువురు మెక్సికన్ జాతీయులకు తమ దౌత్య సిబ్బందిని కలుసుకునే అవకాశాన్ని అమెరికా ఇవ్వలేదు. దీనిపై అమెరికా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం.. అది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నది. ఉరిశిక్ష విధించిన అంతర్జాతీయ ఖైదీలు తమ దేశ దౌత్యసిబ్బందితో సంప్రదించకుండా నిరోధించడం హక్కులను కాలరాయడమేనని స్పష్టంచేసింది. ఈ తీర్పుపై జరిగిన ఓటింగ్‌లో భారత్‌తో పాటు పాక్ కూడా తీర్పునకు మద్దతిచ్చింది. అయితే మరణశిక్షను ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్ ఉదంతంలోనూ భారత దౌత్యాధికారులు ఆయనను సంప్రదించకుండా పాక్ నిరోధిస్తూ వచ్చింది. అవెనా కేసులో ఐసీజే తీర్పునకు మద్దతివ్వడం ద్వారా పరోక్షంగా పాక్ తన తప్పిదాన్ని అంగీకరించినట్లయ్యింది.
Tags:Pak support for international court ruling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed