పాకిస్తాన్ 700 సార్లు కవ్వింపు చర్యలు

Date:21/05/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
సరిహద్దు వెంట పాక్ కవ్వింపు చర్యలకు భారత్ దీటుగా సమాధానమిచ్చింది. భారత్ జరిపిన ప్రతీకార దాడులను నిలిపేయాలంటూ పాకిస్థాన్ దళాలు ఓ దశలో బీఎస్‌ఎఫ్‌ను వేడుకున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా జమ్ము కశ్మీర్ సహా సరిహద్దుల వెంట కాల్పుల విరమణ పాటించాలని భారత్ ప్రకటించినప్పటికీ పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న క్రమంలో బీఎస్‌ఎఫ్ దీటుగా బుద్ధి చెప్పింది. దీనికి సంబంధించి ఆదివారం 19 సెకన్ల వీడియోను భారత సరిహద్దు దళం అధికారులు విడుదల చేశారు. దాడులను నిలిపివేయాలని మమ్మల్ని పాక్ రేంజర్స్ అభ్యర్థించారు. వారు ఇష్టారీతిగా కాల్పులకు తెగబడడంతో భారత్ దిమ్మతిరిగే పోయే సమాధానం ఇచ్చింది. దాంతో కాల్పులు నిలిపివే యాలని కాళ్ల బేరానికి వచ్చారని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి వెల్లడించారు. అంతకుముందు పాకిస్థాన్ మోర్టార్ షెల్స్‌తో భారత బలగాలపై విరుచుకుపడింది. శుక్రవారం పాక్ జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవాను మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బీఎస్‌ఎఫ్ విడుదల చేసిన వీడియోలో పాక్ బంకర్ల లక్ష్యంగా ఓ రాకెట్ దూసుకెళ్తున్నట్లు ఉంది. అనంతరం అది లక్ష్యాన్ని ఢీకొని భారీ పేలుడు సంభవించింది. ఈ దృశ్యాలను ఇన్‌ఫ్రారెడ్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. మూడు రోజులుగా పాక్ లక్ష్యంగా భారత్ జరిపిన దాడులతో అటువైపు భారీ నష్టం వాటిల్లినట్లు బీఎస్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద దాయాది దేశం ఇప్పటికే 700 సార్లు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ ఘటనల్లో 38 మంది సాధారణ పౌరులు చనిపోగా, 18 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
Tags: Pakistan has 700 times excavation measures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *