ప్రధాని మోడి చిత్రపాటానికి పాలాభిషేకం
మదనపల్లె ముచ్చట్లు:
గ్రామీణ స్థాయి విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారని బిజెపి రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండు నందు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యల్లంపల్లి ప్రశాంత్, బండి ఆనంద్, జర్మనీ రాజు, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిలోకేష్ మాట్లాడుతూ దేశంలో దాదాపు 84 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా కేవలం మన రాష్ట్రానికే ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిన ఘనత ప్రధానికి దక్కుతుందని చెప్పారు.

Tags: Palabhishekam for Prime Minister Modi’s film
