సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
తుగ్గలి ముచ్చట్లు:
మండల పరిధిలోని గల శభాష్ పురం గ్రామ సచివాలయం నందు ప్రజా ప్రతినిధులు,సచివాలయ ఉద్యోగులు మరియు లబ్ధిదారులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు.వివరాలలోకి వెళ్ళగా గురువారం రోజున శభాష్ పురం గ్రామ సచివాలయం నందు నూతన పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు మరియు గ్రామ సచివాల వ్యవస్థను రెగ్యులర్ చేసి నూతన పే స్కేలు అమలు చేసినందుకు గాను వారు గ్రామ సర్పంచ్ పుష్పవతి,మాజీ సర్పంచ్ హనుమంతు ల ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉద్యోగుల మరియు ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Tags: Palabhishekam for the image of CM

