పుంగనూరులో జర్నలిస్టులచే సీఎం జగన్‌కు పాలాభిషేకం
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించడంపై ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆదివారం గౌరవ అధ్యక్షుడు పి.ఎన్ .ఎస్.ప్రకాష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎంబిటి రోడ్డులో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ల చిత్రపటాలకు పెట్టి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ముఖ్యమంత్రి జిందాబాద్…మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి జిందాబాద్ అంటు నినాదాలు చేశారు. ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత వరకు ఏ ప్రభుత్వము జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయింపుపై మంత్రి మండలిలో తీర్మాణించలేదన్నారు. నిత్యం సమజసేవలో ఉన్న జర్నలిస్టుల సేవలను గుర్తించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల తరపున ప్రభుత్వానికి రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వసంతకుమార్, సురేష్, వాలీశ్వర్‌రెడ్డి, జగన్, సలీం, అప్పిరెడ్డి, జిఆర్.మురళి, సతీష్, సైపుల్లా, డిష్ సతీష్‌కుమార్, రాజేష్, దీపక్, కోటరెడ్డిప్రసాద్, మర్రిబాబు, అప్పా, జావీద్, కుమార్, చిన్నస్వామి , భానుమహర్షి, లోకేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: Palabhishekam to CM Jagan by journalists in Punganur
