పుంగనూరులో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
పుంగనూరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి ఎస్సీ, ఎస్టీలు, నాయకులు కలసి సోమవారం పాలాభిషేకం చేశారు. దళిత నాయకులు రాజు, చెన్నరాయుడు, మహిళలు కలసి ముఖ్యమంత్రి , మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం క్రింద ఆర్థిక సహాయం అందించడం శుభపరిణామమని కొనియాడారు. మహిళలు జగనన్నకు తోడుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెంచుపల్లె కృష్ణప్ప, సర్పంచ్ ఆంజప్ప, నాయక్, శ్రీనివాసులు, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

Tags: Palabhishekam to CM Jagan’s portrait in Punganur
