పుంగనూరులో సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

పుంగనూరు ముచ్చట్లు:

సచివాలయ కార్యదర్శులను రెగ్యూలర్‌ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించడంతో సచివాలయ ఉద్యోగులు కలసి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శుక్రవారం మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా , కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి మాట ఇచ్చిన మేరకు ఉద్యోగులను రెగ్యూలర్‌ చేయడం , పీఆర్‌సీ వర్తింప చేయడం అభినందనీయమని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లలిత, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు రేష్మా, రెడ్డెమ్మ, సాజిదాబేగం తదితరులు పాల్గొన్నారు.

Tags: Palabhishekam to CM Jagan’s portrait in Punganur

Leave A Reply

Your email address will not be published.