పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని చండ్రమాకులపల్లెలో అంబేద్కర్ భవన్‌కు రూ.25 లక్షలు కేటాయించడంపై రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటానికి దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. బుధవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో దళిత నాయకులు, మాజీ జెడ్పిటిసి వేమన్న, చెన్నరాయులు, రాజా , శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, అర్భన్ డెవలెప్‌మెంట్ అథారిటి చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ప్రాంతంలోను అంబేద్కర్ భవనాల నిర్మాణానికి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిలు కోట్లాది రూపాయలు కేటాయించారని తెలిపారు. అన్ని కులాలకు కమ్యూనిటి భవనాల కోసం సొంత నిధులు కేటాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి కుటుంభానికి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, సర్పంచ్ ఆంజప్ప, గంగాధర్, విజయకుమార్, పెంచుపల్లి కృష్ణప్ప, చిన్నప్ప, కోఆఫ్షన్‌మెంబరు బాబ్‌జాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Palabhishekam to the portrait of Minister Peddireddy in Punganur
