Natyam ad

పలమనేరు డిఇఇ నరసింహాచారి మృతి- మంత్రి పెద్దిరెడ్డి సంతాపం

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు హౌసింగ్‌ డీఇఇగా పని చేస్తున్న నరసింహాచారి (55) ఆనారోగ్యంతో ఆదివారం వేకువజామున మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. అలాగే ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, కమిషనర్‌ నరసింహాప్రసాద్‌రెడ్డి ,ఎంపీడీవో రామనాథరెడ్డి, తహశీల్దార్‌ వెంకట్రాయులు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. హౌసింగ్‌ డీఇఇగా విశిష్ట సేవలు అందించి పలువురి మనన్నలు పొందారు. ఆయన ఆకాలంగా మృతి చెందడంతో ప్రజలు తీవ్ర ఆవేదనకు లోనైయ్యారు. విషయం తెలిసిన వెంటనే హౌసింగ్‌ అధికారులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వగ్రామమైన పలమనేరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

 

Post Midle

Tags: Palamaneru DEE Narasimhachari passed away

Post Midle

Leave A Reply

Your email address will not be published.