Natyam ad

దొంగతనాల నివారణ గురించి పలమనేరు పొలీసు వారి విజ్ఞప్తి

పలమనేరు  ముచ్చట్లు:

పోలీసు వారు పలమనేరు సబ్ డివిజన్ పరిదిలోని ప్రజలకు ఈ క్రింది నిబంధనలు పాటిస్తూ దొంగతనాల నివారణకు పోలీసువారికి సహకరించాలని విజ్ఞప్తి .

Post Midle

➡ ప్రతి ఒక్కరూ వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు, నగదు, బంగారును అవసరమైనంత మేరకు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. అవసరము లేనివి బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవడము ఉత్తమమైన పద్దతి.

➡ బీరువాకు తాళం వేసిన తరువాత, తాళాము చెవులు బీరువా పైన కాని, బీరువాలోని బట్టల క్రింద కానీ, లేదా ప్రక్కన గోడకు తగిలించడము కానీ చేయరాదు.

➡ బయటకు వెళ్లేటప్పుడు గాని లేదా ఇతర ఊర్లకు వెళ్ళేటప్పుడు గాని, ఇంట్లో మరియు బయట లైట్‌ వేసి ఉంచండి. ఇంటి ముందు తలుపులకు సెంటర్‌ లాక్‌ వేయండి. ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు. తాళం కనిపించకుండా కర్టన్స్ వేయాలి.

➡ మీరు ఏదైనా ఇతర ఊర్లకు వెళ్లేటప్పుడు మీకు నమ్మకమైన వారికి, అలాగే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి వెళితే, పోలీసు వారు నైట్‌ బీట్‌ వారితో ఆ ప్రదేశములో గస్తీ నిర్వహించేలా చర్య తీసుకొనబడును.

➡ ఏదైనా ఇతర ఊర్లకు వెళ్లినట్లెతే మీరు పక్క ఇంటి వాళ్లకు, మీ ఇంటి దగ్గరలో ఉండే మీకు ముఖ్యమైన బంధువులకు, అప్పుడప్పుడు ఫోన్‌ చేసి మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెబుతూ ఉండాలి. ఊరికి వెళ్ళినపుడు ఎవరో ఒకరిని కాపలా ఉంచాలి.

➡ స్త్రీలు బయటకు వెళ్లేటప్పుడు, వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు లేదా ఉదయము, సాయంత్రము వాకింగ్‌ కి వెళ్ళేటప్పుడు, మెడలోని బంగారు ఆభరణాలు కనిపించకుండా జాగ్రత్తగా కవర్‌ చేసుకుంటే మంచిది. తద్వారా చైన్‌ స్నాచింగ్‌ నేరములు జరగకుండా నివారించేందుకు వీలవుతుంది.

➡ మీ ఇంటికి నలువైపుల సిసీ కెమెకాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని DVR/NVR ను రహస్య ప్రదేశాలలో భద్రపరుచుకోవాలి. మొబైల్‌ యాప్‌ ద్వారా సీసీ కెమెరా దృశ్యాలు మీరు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది.

➡ మీ కాలనీలలో కమిటిలు గా ఏర్పడి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది. ప్రధాన రహదారులు కవర్‌ అయ్యే విధముగా CC కెమెరాలు అమర్చుకుంటే భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది.

➡ మీరు బస్సు లేదా రైలు ప్రయాణ సమయంలో ఆపరిచత వ్యక్తులు ఇచ్చిన తిను బండారాలు తీసుకోవద్దు. విలువైన వస్తుమలు తీసుకు వెళ్తుంటే అటువంటి బ్యాగును మీ దగ్గరే భద్రంగా పెట్టుకోవాలని మర్చిపోవద్దు.

➡ మీ ప్రక్కనే కూర్చున్న వారు మిమ్మల్ని నమ్మించి లేదా మాటల్లో పెట్టి బ్యాగ్‌ లు కొట్టేసే గ్యాంగ్‌ లు ఎప్పుడు తిరుగుతూ ఉన్నాయన్న విషయమును మరచిపోవద్దు.

➡ రద్దీ ఉన్న ప్రదేశాలలో, బస్సులు ఎక్కేటప్పుడు మీ సెల్‌ ఫోన్‌ లు, పర్స్‌ల మీద ఎప్పుడు దృష్టి ఉంచండి. మీ ప్రక్కన ఉన్న ఆపరిచిత వ్యక్తులను ఎప్పుడు ఆనుమానాస్పదముగానే చూడండి.

➡ గతములో ఎప్పుడు కూడా మా ఇంటిలో దొంగతనము జరుగలేదని లేదా మా కాలనీలలో అటువంటివి జరుగలేదు కాబట్టి, ఇక్కడ ఎప్పుడు దొంగతనములు జరుగవు అనే భావన ఎప్పుడూ వద్దు. అటువంటి చోటే దొంగతనములు జరిగేందుకు ఎక్కువ ఆవకాశము ఉంది

➡ మీరు బయటికి వెళ్లే విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకండి. అలా షేర్‌ చేసినట్లైతే వారిని మీ ఇంటికి వచ్చి దోచుకుని వెళ్ళమని ఆహ్వానించినట్లే. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ప్రయాణ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకుండ గోప్యముగా ఉంచే ప్రయత్నము చేయండి.

➡ కాలనీలలో అనుమానాస్పాదముగా తిరిగే వారిని ప్రశ్నించి, వారి వివరాలు అడగండి, వారు. స్పందించనట్లైతే వెంటనే సమాచారమును DAIL100 నెంబర్‌ కు గాని, లేదా స్థానిక CI / SI గారికి తెలియపరచండి.

➡ ATM ల వద్ద అపరిచిత వ్యక్తుల ద్వారా మీ యొక్క ATM కార్డ్ ని వారికి ఇచ్చి ATM లో లావాదేవీలను చేయించరాదు, అలాంటి వారు మీ యొక్క ATM కార్డ్ ని మార్పు చేసి మోసం చేస్తారు.

➡ బ్యాంకుల వద్ద డబ్బు డ్రా చేసుకొని వెల్లునపుడు (Attention Diversion Groups) దృష్టి మరల్చి దొంగతనాలు చేసే అవకాశం ఉంది.

➡ టు వీలర్స్, ఫోర్ వీలెర్స్ లను అవకాశం ఉంటే ఇండ్లలో/ఇంటి ఆవరణలో తగు జాగ్రతలతో పార్కింగ్ చేసుకోవలెను. వీలైతే తమ వాహనాలకు GPS tracking సదుపాయం కల్పించుకోవాలి.

➡ ఇండ్లలోని కిటికీల వద్ద ఫోన్ లు గాని ల్యాప్టాప్ లు కానీ మరే ఇతర విలువైన వస్తువులు ఉంచరాదు.

➡ మీరు కుటుంబం తో సహా వేరే ఊరికి వెల్లునట్లయితే సంబందిత పోలీసు స్టేషన్ లో సమాచారం తెలిపితే బీటు సిబ్బందిచే నిఘా ఉంచబడును మరియు LHMS కెమరా మీ ఇంటిలో అమర్చబడును.

➡ ( కాలనీలు, వీధులలో, పరిసర ప్రాంతాలలో) పోలీసు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలు గా ఏర్పడి , పోలీసులు 24X 7 గస్తీ నిర్వహిస్తారని అంతేకాక పగలు దిశ టీం వారు,CCS సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వారు,మఫ్టీ క్రైమ్ పార్టీవారు,డే బ్ల్యూ కొట్స్ వారు ఇలా పోలీసు వారు దొంగతనాల నివారణకు మరియు అసాంఘిక కార్యాకలాపాలు జరుగకుండా విధులు నిర్వహిస్తున్నారు.కావున పలమనేరు ప్రజలు కూడా పై నిబందనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని పోలీసు వారి విజ్ఞప్తి.

 

Tags: Palamaneru Police’s appeal for prevention of thefts

Post Midle