పాలమూరు ప్రజలు మరోసారి మోసపోరు

Palamuru people will never be deceived

Palamuru people will never be deceived

Date:10/10/2018
వనపర్తి  ముచ్చట్లు:
పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నరు. తెలంగాణ కోసం పోరాడిండని కేసీఆర్ కు ఓటు వేసి ప్రజలు రుణం తీర్చుకున్నారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల రుణం కేసీఆర్ తీర్చుకున్నారా అని కాంగ్రెస్ నేత డీకే ఆరుణ అన్నారు. బుధవారం నాడు ఆమె వనపర్తి జిల్లా కొత్తకోట లో కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో మాట్లాడారు. ఉద్యోగాలు ఇచ్చాడా. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిండా. ఇలా మోసం చేసిన పార్టీకి ఓటేయ్యాలా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది.లక్ష ఉద్యోగాలు ఇస్తుంది. ఐదు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి పెడుతుంది. వనపర్తి సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 95 శాతం పనులు చేస్తే, పై పై పనులు చేసి 8 లక్షల ఎకరాలకు నిళ్లిచ్చామని చెప్పారు. పాలమూరు ప్రజలు మరో సారి మోసపోరని అన్నారు.
Tags:Palamuru people will never be deceived

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed