శశికళకు ఎంట్రీ లేదన్న పళని స్వామి.. రాజకీయవర్గాల్లో తీవ్రచర్చ

Date:20/01/2021

చెన్నై  ముచ్చట్లు:

కోర్టు కేసులతో తమిళనాడు సీఎంగా ఫళనిస్వామిని చేసేందుకు జయలలిత నెచ్చలి శశికళ చాలా కష్టపడ్డారు. అప్పటివరకు  జయలలిత అనుచరుడు పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎంగా ఉండేవారు. పన్నీర్ ను దించేసి తన అనుచరుడైన ఫళని స్వామిని పెట్టింది శశికళ. జయలలిత మరణం తర్వాత .. తను జైలుకు వెళ్లేముందు శశికళ ఈ మార్పు చేసింది. అయితే శశికళ జైలుకు వెళ్లడం.. ఫళని పన్నీర్ కలిసిపోవడంతో శశికళకు ఈ బ్యాచ్ దూరమైంది.ఇప్పుడు శశికళ జైలు నుంచి విడుదల అవుతోంది. అదే సమయంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దీంతో సీఎం ఫళనిస్వామి తాజాగా ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. కేంద్రంలోని బీజేపీ కనుసన్నల్లోనే ఫళని స్వామి తమిళనాట నడుస్తున్నాడు. అన్నాడీఎంకే బీజేపీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఫళనిస్వామి టూర్ ఆసక్తి రేపుతోంది.అయితే శశికళను టీటీవీ దినకరన్ ను కలుపుకొని పోవాలని ఫళనికి చెప్పేందుకే బీజేపీ ఆయనను ఢిల్లీ పిలిపించుకుందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఫళనిస్వామి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాతో భేటి కానున్నారు.తాజాగా ఫళనిస్వామి ఢిల్లీలో మాట్లాడారు.ఆమె అన్నాడీఎంకేలో చేరుతారన్న వార్తలను కొట్టిపారేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఆ అవకాశం లేదని.. ఆమె పార్టీలోనే లేదని స్పష్టం చేశారు. వందశాతం శశికళను పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని ఫళని స్వామి కుండబద్దలు కొట్టారు. అన్నాడీఎంకే పార్టీలో ఈ విషయంలో భిన్నాభిప్రాయలు లేవని తెలిపారు.శశికళ మరో వారంలో విడుదల కానున్న నేపథ్యంలో ఫళనిస్వామి తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఫళని స్వామిని సీఎంను చేసేందుకు చాలా కష్టపడ్డ శశికళకే ఇప్పుడు ఫళని స్వామి ఎంట్రీ లేదనడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags:Palani Swamy says there is no entry for Shashikala .. Intense discussion in political circles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *