పల్నాడు జిల్లా వినుకొండ
కడప ఆర్టీసీ బస్ స్టేషన్ ఆధునీకరణకు చర్యలు
జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు
ప్రజా రవాణా వ్యవస్థ లో ఆర్టీసీ సేవలు ఉత్తమం
కడప ముచ్చట్లు:
కడప ఆర్టీసీ బస్ స్టేషన్ ఆదునికరణకు చర్యలు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఆర్టీసీ బస్ స్టేషన్ ఆధునికీకరణ, అభివృద్ధి పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…కడప బస్ స్టేషన్ సముదాయములో గల 13 ఎకరముల ఖాళీ స్థలమును వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ వారితో కలసి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి (ఆర్టీసీ ఆర్.ఎం) గోపాల్ రెడ్డి ను ఆదేశించారు. కడప బస్ స్టేషన్ లోని ఖాళీ స్థలములో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నందుఅధునాతన బస్ స్టేషన్ కట్టి, పై అంతస్తులలో మాల్స్, హోటేల్స్, మోడరన్ డిజిటల్ సినిమా హాల్స్, మల్టీప్లెక్స్ నిర్మించేందుకు ప్రణాళికలనురూపొందించాలన్నారు. అలాగేకడప బస్ స్టేషన్ లోని ఖాళీ స్థలము యొక్క అభివృద్ధి తో పాటు, కొప్పర్తి లోని 150 ఏకరాలలో ఎకనామిక్ కారిడార్ తో అనుసంధానము చేయగల అవకాశాలను పరిశీలించి తగిన ప్రణాళికను రూపొందించుకొని తదుపరి సమావేశానికి రావాలని నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ వారి తరుపున హాజరైన ఎల్.ఎల్.ఎల్ గ్రూప్ కన్సల్టెంట్ శ్రీనివాసన్ కు కలెక్టర్ సూచించారు. అంతకుముందు కలెక్టర్ ఆదేశాల మేరకు .జె ఎల్.ఎల్. కన్సల్టెంట్ శ్రీనివాసన్ కడప బస్ స్టేషన్ ఖాళీ స్థలములోనిసముదాయములను, చుట్టుప్రక్కల గల వాణిజ్య సముదాయములను, కడపలో ముఖ్యమైన ప్రదేశాలను పరిశీలించామన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ సూచన మేరకు జిల్లా మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ ను కలసి ఈ ప్రాజెక్టువివరాలు తెలిపి సహాయ సహకారాలు అందించాలనే విజ్ఞప్తి కి ఆయన సానుకూలంగా స్పందించారని ప్రజా రవాణా అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈ.ఈ వెంకటరమణ, ఆర్టీసీ డి.ఈ పోతురాజు, డిపో మేనేజర్ డి.శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.
Tags: Palnadu District Vinukonda