పల్నాడు పోరాట యోధుడిని కోల్పోయింది: యనమల

–     వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

Date:16/09/2019

గుంటూరు ముచ్చట్లు:

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి వార్త విన్న టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాడు పోరాట యోధుడిని కోల్పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వేధింపులతోనే కోడెల మృతి చెందారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కోడెల, ఆయన కుటుంబసభ్యులపై ప్రభుత్వం కేసులు పెట్టి, వేధింపులకు గురిచేసిందని యనమల ఆరోపించారు. పార్టీ కోసం కోడెల చివరివరకు పరితపించారని యనమల పేర్కొన్నారు.కాగాఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చనిపోయేంతవరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఆత్మహత్యగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కోడెల బాధ్యతలు నిర్వహించిన బసవతారకం ఆస్పత్రిలోనే.. మృతిచెందడం బాధాకరమని సోమిరెడ్డి విచారం వ్యక్తం చేశారు.

కాలుష్యాన్ని నివారించేందుకు హరితవనం

Tags: Palnadu lost combatant: Yanamala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *