పామాయిల్ సంగతేంటి..?

Cooking oil processing unit in AP

Cooking oil processing unit in AP

Date:12/06/2019

ఏలూరు ముచ్చట్లు:

రాష్ట్రంలోనే అత్యధికంగా పామాయిల్‌ సాగు చేసే జిల్లా పశ్చిమ. పామాయిల్‌ సాగు వల్ల భారతదేశానికి వంటనూనెల దిగుమతులు తగ్గి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతోంది. ఈ సాగును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో 65వేల హెక్టార్లలో పామయిల్‌ సాగు జరుగుతోంది. ప్రసుతం పామాయిల్‌ టన్ను గెలల ధర రూ.7,800 ఉంది. ఈ సొమ్ము కూడా 20 నుంచి 30 రోజుల వరకు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో వారం నుంచి పది రోజుల్లో చేతికి వచ్చే సొమ్ములు కొంత కాలంగా తీవ్ర జాప్యమవుతున్నాయంటున్నారు. దీనికి తోడు రికవరీ శాతం తక్కువగా ఉండడంతో ఏపీలో పామాయిల్‌ ధర తక్కువగా అందుతోంది. పక్కనున్న ఖమ్మం జిల్లాలో ప్రతి టన్నుకు సుమారు రూ.300 వరకు అదనంగా ఇస్తున్నారు. అంతేకాక రవాణా ఛార్జీలతోపాటు గెలలు విక్రయించిన నాడే సొమ్ములు చేతికి ఇస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ధరల వ్యత్యాసంపై రైతులు పెదవి విరుస్తున్నారు.

 

 

 

పెదవేగిలోని ఆయిల్‌ఫెడ్‌లో గానుగ ఆడగా వచ్చిన ఆయిల్‌ రికవరీ శాతం ఆధారంగా ఏపీలో పామాయిల్‌ టన్ను గెలల ధర నిర్ణయిస్తున్నారు. ఇక్కడ కంటే ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్‌ ఫ్యాక్టరీలో రికవరీ కొంత ఎక్కువ వస్తోంది. ఈ కారణంగా అక్కడి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి పెదవేగిలోని ఆయిల్‌ఫెడ్‌లో యంత్రాలను ఆధునికీకరించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పామాయిల్‌ రైతులకు న్యాయం చేస్తానన్నారని ఇటీవల ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ పేర్కొన్నారు. పామాయిల్‌ రైతు సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

 

 

 

 

పామాయిల్‌ రైతుల నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం రూ.65 కోట్లు మంజూరు చేసింది. ప్రతి టన్ను పామాయిల్‌ గెలకు రైతుకు అదనంగా ఒక శాతం ఓఈఆర్‌ (ఆయిల్‌ ఎక్స్‌ టెన్షన్‌ రేషియా)ను కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు 2017లో నిధులు మంజూరు చేశారు. 2017 నవంబరు నుంచి 2018 అక్టోబరు (ఆయిల్‌ ఇయర్‌) వరకు ఈ పైకం మంజూరు చేశారు. దాదాపు 8.76 లక్షల మెట్రిక్‌ టన్నులకు సంబంధించి రైతులకు ఈ పైకాన్ని అందించాలి. ఇవి నేటికీ రైతులకు అందలేదు. పెదవేగిలోని ఆయిల్‌ ఫెడ్‌ మాత్రం నాలుగు నెలలకు సంబంధించి రూ.2.50 కోట్లు అందించింది. జిల్లాలోని మిగిలిన రైతులెవరికీ అదనపు సహాయం అందలేదు. ఏలూరు ఉద్యానశాఖ డివిజన్‌ పరిధిలో 4.24 లక్షల మెట్రిక్‌ టన్నుల పామాయిల్‌ గెలలకు 7,700 మంది రైతులకు ఓఈఆర్‌ అందాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం ఉద్యానశాఖ డివిజన్‌ పరిధిలో 4.52 లక్షల మెట్రిక్‌ టన్నుల పామాయిల్‌ గెలలకు గాను 9.097 మంది రైతులకు ఓఈఆర్‌ అందాల్సి ఉంది. ఈ పైకం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

ఉష్ణోగ్రతలు ఆక్వా రంగాన్ని ఊపిరాడకుండా చేస్తోంది

Tags:Pamaal Sangatanti ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *