పాన్ ఆధార్ లింక్… గడువు పెంపు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

పాన్‌ కార్డు, ఆధార్‌ అనుసంధాన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కరోనా వ్యాప్తి కేసుల దృష్ట్యా గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా ప్రకటన చేసింది. పాన్ కార్డుతో ఆధార్ ను అనుంధానించాలని కేంద్రం ప్రజలను ఎప్పటినుంచో కోరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి గడుపు పెంపు నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు గడువు విధించగా.. అది మరికొన్నిరోజుల్లో ముగియనుంది. సెక్షన్ 139 AA ప్రకారం ప్రతి పౌరుడు తమ ఆదాయ వివరాల సమర్పణ పత్రంలోనూ, పాన్ కార్డు దరఖాస్తులోనూ ఆధార్ నెంబరు పొందపరచడం తప్పనిసరి. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబరు 30 తర్వాత చెల్లుబాటు కావని కేంద్రం తెలిపింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:PAN Aadhaar link … expiration date

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *