జమ్మూలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం
జమ్మూ ముచ్చట్లు:
జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వహించారు. వైదిక కార్యక్రమాల్లో భాగంగా బింబశుద్ధి కోసం పంచగవ్యాధివాసం చేపట్టారు. ముడిశిలను శిల్పులు చాకచక్యంగా స్వామి, అమ్మవార్ల విగ్రహాలుగా మలుస్తారు. ఈ క్రమంలో సుత్తి, ఉలి దెబ్బలకు వేదనకు గురయ్యే విగ్రహాలకు ఉపశమనం కల్పించడం కోసం పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో అభిషేకం చేశారు. ముందుగా అక్షిణ్మోచనం, నవకలశస్నపనం నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్ శ్రీ రామకృష్ణ దీక్షితులు, డెప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, శివప్రసాద్, ఇఇ సుధాకర్, డెప్యూటీ ఇఇ రఘువర్మ, డెప్యూటీ ఇఇ(ఎలక్ట్రికల్) చెంగల్రాయలు, ఏఈవో కృష్ణారావు, ఏఈ సీతారామరాజు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:Panchagadiyavasam scientifically in Jammu
