శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకాలు

కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు
బంగారు చీరతో అమ్మవారు భక్తులకు దర్శనం

 

విశాఖపట్నం ముచ్చట్లు:


ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం(వరలక్ష్మీ వ్రతం) సందర్భంగా విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతంని పురస్కరించుకుని తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు.. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది  భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించారు.. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు..ఆలయ ఈవో శిరీష ఆధ్వర్యంలోఏఇఓ రాంబాబు  భక్తులకు విశేష ఏర్పాట్లు చేశారు.

బంగారు చీరలో కన్యకా పరమేశ్వరి దర్శనం

వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని పాతనగరం లో కొలువై ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని బంగారు చీరతో అందంగా అలంకరించారు.. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.. బంగారు చీరలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరవశం చెందారు.

 

 

Tags: Panchamritabhishekas to Sri Kanakamahalakshmi Goddess

Leave A Reply

Your email address will not be published.