నెల రోజుల్లో పంచాయతీ ఎన్నికలు: కేసీఆర్

Vote for Congress and TRS

Vote for Congress and TRS

Date:23/11/2018
వరంగల్ ముచ్చట్లు:
మంచి మార్పు రావాలంటే ప్రజలే గెలవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం  సాయంత్రం డోర్నకల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెల రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 50 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ డోర్నకల్‌ను పట్టించుకోలేదని కేసీఆర్ అన్నారు. ప్రజలు గెలిచే ప్రజాస్వామ్యం వస్తేనే ఆశించిన అభివృద్ధి జరుగుతందన్నారు. 58 ఏళ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ కూటమి ఒక వైపు.. నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒక వైపు ఉన్నాయని.. ఏ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్న నియోజకవర్గం డోర్నకల్ అని కేసీఆర్ చెప్పారు. నియోజకవర్గంలో 84 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని. త్వరలో డోర్నకల్‌లో 84 మంది గిరిజనులు సర్పంచ్ కాబోతున్నారని అన్నారు.
పాలేరు నుంచి డోర్నకల్‌కు కూడా నీళ్లు కావాలని రెడ్యానాయక్ నాతో కొట్లాడిండు. తన ప్రజలు బాగుండాలని రెడ్యానాయక్ తపన. డోర్నకల్‌కు ఎస్సారెస్పీ కాలువవస్తోంది. దాన్ని రూ. 1000 కోట్లతో బాగు చేస్తున్నాం’ అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రెడ్యానాయక్ చాలా సీనియర్ నాయకుడని, సభకు వచ్చిన జనాలను చూస్తుంటే రెడ్యానాయక్ గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు.టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా గిరిజనల భూమి సమస‍్యలు పరిష్కరిస్తామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గిరిజనుల జనాభా పెరిగిందని, మీకు రిజర్వేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ‘కేసీఆర్‌ జగమొండి. చెప్పింది సాధించి తీరుతాడు. తెలంగాణ రాష్ట్రాన్నే సాధించాం. రిజర్వేషన్లు కూడా తీసుకురాలేమా’ అన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఆ కాంగ్రెసాయన పేరేంది. మాజీ ఎంపీ బలరాం నాయక్‌. ఆ పుణ్యాత్ముడు ఎలాంటోడంటే.
కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయకపోతే మిమ్మల్ని ఆంధ్రాలో కలుపుతా అంటడు. మనమే ఆయనను పాకాలలో కలిపితే పోలే. బలరాం నాయక్‌ ఇష్టం ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర జీతగాడిగా ఉండు. బలరాం లాంటి చీము, నెత్తురు లేనివాళ్ల పుణ్యంతోనే ఇంకా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా నాయకుల సంచులు మోస్తున్నారు. మళ్లీ మనకు ఆంధ్రోళ్ల పాలన ఎందుకు. కాంగ్రెసోళ్లు 1969లో ఉద్యమకారుల్ని చంపారు. రెండోదశ పోరాటంలోనూ కాల్పులు జరిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అనే ముఖ్యమంత్రి తెలంగాణ రానివ్వమని చెప్పారు. కానీ ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గతంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో కాలువల్లో తుమ్మచెట్లు మొలినాయి. చెరువులను నీళ్లతో నింపింది టీఆర్‌ఎస్‌. రైతు బీమా చాలా అద్భుతమైన పథకం. ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల బీమా ఇస్తున్నం. కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు వస్తాయని మనం కలలో కూడా ఊహించలేదని’ కేసీఆర్‌ ప్రసంగించారు.
Tags:Panchayat Elections in the Month Day: KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *